Breaking News

ఫిలిప్పీన్స్‌లో ఇండియన్ కంపెనీ.. 48 దేశాల్లో హవా

Published on Fri, 08/02/2024 - 10:20

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే బ్రాండ్ అమ్మకాలను ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ తరుణంలో కంపెనీ తన కార్యకలాపాలను ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించింది.

కొలంబియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో భాగమైన టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్ (TMC).. ఫిలిప్పీన్స్‌లోని హీరో మోటోకార్ప్ ఉత్పత్తుల అసెంబ్లర్, విక్రయదారుగా ఉంటుంది. ఈ భాగస్వామ్యం అక్టోబర్ 2022లో ప్రకటించినప్పటికీ ఇప్పటికి అమలు అయ్యింది. దీంతో హీరో మోటోకార్ప్ వాహనాలు ఆగ్నేయాసియా మార్కెట్‌లోకి కూడా విస్తరిస్తున్నాయి.

ఫిలిప్పీన్స్‌లోని లగునాలో టెర్రాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్‌లో అసెంబ్లీ యూనిట్, విడిభాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 600 చదరపు మీటర్ల విస్తీరణంలో ఉన్న ఈ సదుపాయంలో సంవత్సరానికి 1.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలుస్తోంది.

ఈ కొత్త తయారీ కేంద్రంలో ఎక్స్‌పల్స్ 200 4వీ, హంక్ 160ఆర్ 4వీ, జూమ్ వంటి టూ వీలర్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. హీరో మోటోకార్ప్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)