Breaking News

ఇక అందుబాటు ధరలో హీరో ఎలక్ట్రిక్‌ టూ-వీలర్లు

Published on Fri, 11/08/2024 - 10:02

వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ తమ ఎలక్ట్రిక్‌ టూ–వీలర్ల వ్యాపార విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. వచ్చే కొద్ది నెలల్లో అందుబాటు ధరల్లో మరిన్ని మోడల్స్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. హీరో మోటోకార్ప్‌ సీఈవో నిరంజన్‌ గుప్తా ఈ విషయాలు తెలిపారు.

‘వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) విభాగం చాలా సందడిగా ఉండబోతోంది. విడా శ్రేణికి సంబంధించి అందుబాటు ధరల్లో మోడల్స్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విడా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలు రూ. 1–1.5 లక్షల శ్రేణిలో (రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలతో కలిపి) ఉన్నాయి. 230 నగరాలు, పట్టణాల్లో విడా స్కూటర్లను కంపెనీ విక్రయిస్తోంది. 32 రోజుల పాటు సాగిన పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి స్పందన కనిపించిందని, 11,600 యూనిట్లు విక్రయించామని గుప్తా వివరించారు.

క్షేత్రస్థాయిలో భౌతికంగా సేల్స్, సర్వీస్‌ మౌలిక సదుపాయాలు ఉంటే కస్టమర్‌కి మరింత నమ్మకం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉండటం తమకు కలిసి వచ్చే అంశమని వివరించారు. ఈవీల విభాగంలో ధర, కస్టమర్‌ సర్వీసు అంశాలే దీర్ఘకాలికంగా ఏ కంపెనీకైనా కీలకం అవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్‌ ప్లాంటులో తయారీ

ఇక దేశీ మార్కెట్లో మొత్తం వాహన విక్రయాలపరంగా చూస్తే పట్టణ ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాలు కూడా క్రమంగా పుంజుకుంటున్నాయని గుప్తా చెప్పారు. ఈ ఏడాది పండుగ సీజన్‌లో హీరో మోటోకార్ప్‌ విక్రయాలు గత సీజన్‌తో పోలిస్తే 13 శాతం పెరిగి 15.98 లక్షల యూనిట్లకు చేరాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో బ్రిటన్, ఇటలీ, స్పెయిన్‌ తదితర దేశాల్లోకి కూడా విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)