Breaking News

హీరో స్కూటర్‌.. కొత్త ఎడిషన్‌ కావాలా? ధర ఎంతంటే..

Published on Fri, 10/30/2026 - 17:10

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన డెస్టిని 110 స్కూటర్‌ శ్రేణిలో కొత్త స్పెషల్‌ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. ‘డెస్టిని 110 క్లాసిక్‌ ఎడిషన్‌’ పేరుతో విడుదల చేసిన ఈ మోడల్‌ ధరను రూ.76,400 (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ)గా నిర్ణయించింది. పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ కొత్త ఎడిషన్‌లో ప్రధానంగా డిజైన్‌, రంగుల పరంగా కొన్ని మార్పులు చేసింది. ఇంజిన్‌, పనితీరులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

రెండు కొత్త రంగుల్లో..

ఈ ‘డెస్టిని 110 క్లాసిక్‌ ఎడిషన్‌’ స్కూటర్‌ రెండు డ్యూయల్‌ టోన్‌ రంగుల్లో లభిస్తుంది. బ్రౌన్‌ ఇన్నర్‌ ప్యానెల్స్‌తో మ్యాట్‌ గోల్డ్‌ఫిష్‌ సిల్వర్‌/లైట్‌ ఇండస్ట్రియల్‌ గ్రే, బ్లాక్‌ ఇన్నర్‌ ప్యానెల్స్‌తో మ్యాట్‌ ఏరీస్‌ బ్రౌన్‌ రంగులను అందిస్తోంది. కొత్త స్ట్రైప్‌ గ్రాఫిక్స్‌, రంగులకు సరిపోయే అద్దాలు, సీటు, రిమ్‌ టేప్‌తో పాటు ప్రత్యేకమైన 3డీ క్లాసిక్‌ ఎడిషన్‌ బ్యాడ్జ్‌ ఈ స్కూటర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అవే ఫీచర్లు.. అదే ఇంజిన్‌

ఫీచర్ల విషయానికి వస్తే.. 785 మి.మీ పొడవైన సీటు, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్‌, ముందు, వెనుక 12 అంగుళాల చక్రాలు ఉన్నాయి. వెనుకవైపు 100/80-12 వెడల్పాటి టైర్‌ను అమర్చారు. 19 లీటర్ల అండర్‌ సీట్‌ స్టోరేజ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ సదుపాయంతో కూడిన ఫ్రంట్‌ కంపార్ట్‌మెంట్‌, బూట్‌ ల్యాంప్‌ వంటి సౌకర్యాలున్నాయి.

ఇందులో 110.9 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 7,250 ఆర్‌పీఎం వద్ద 8.15 పీఎస్‌ పవర్‌ని, 5,750 ఆర్‌పీఎం వద్ద 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్‌ సీవీటీ గేర్‌బాక్స్‌తో పాటు ఇంధన ఆదాకు తోడ్పడే ఐ3ఎస్‌ (i3S) టెక్నాలజీని కూడా అందించారు.

2025 సెప్టెంబర్‌లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన డెస్టిని 110 శ్రేణిలో ఈ కొత్త ఎడిషన్‌ చేరింది. సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకమైన రూపాన్ని కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: ట్రయంఫ్‌ టైగర్‌ 1200.. కొత్త బైక్‌లు వస్తున్నాయ్‌..

Videos

పోలింగ్ రోజు మా వాళ్లపై చిన్న గీత పడినా... అవినాష్ రెడ్డి మాస్ వార్నింగ్

రాప్తాడులో బాలిక ఘటన విన్నాక... లోకేష్, అనితపై తోపుదుర్తి సంచలన కామెంట్స్

రాప్తాడు బాలిక ఘటన YS జగన్ రియాక్షన్

రంపంతో కోసింది ఎవడంటే.. టీచర్ రియాక్షన్

ప్రచారం చేయదు .. కాళ్లు చేతులు విరిచేస్తా.. TDP నేత రూపేష్ వార్నింగ్

విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..

రంపంతో దాడి.. అమ్మాయి మేనత్త చెప్పిన సంచలన విషయాలు

ఎవరొచ్చినా అదే దూకుడు.. మారని ఇజ్రాయెల్ వైఖరి..!

రాప్తాడు స్కూల్ లో దారుణం! టెన్త్ బాలికపై రంపంతో...

రంపంతో విద్యార్థినిపై దాడి నిందితుడు అరెస్ట్

Photos

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఫెస్టివ్ మూడ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

బ్లూ డ్రెస్‌లో నటి ప్రణవి గ్లామర్.. (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో శ్రద్ధాకపూర్ గ్లామర్‌.. (ఫోటోలు)

+5

భర్తతో కాజల్ అగర్వాల్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

ధోనితో మంధాన ముచ్చట.. ఫొటోలు వైరల్‌

+5

'ఆదర్శ కుటుంబం'మూవీ HD స్టిల్స్‌

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)