Breaking News

ఆర్థిక సర్వే 2025 ముఖ్యాంశాలు

Published on Fri, 01/31/2025 - 15:52

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమగ్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 2024-25లో జరిగిన వృద్ధిని, భవిష్యత్తు అంచనాలతో 2025 ఆర్థిక సర్వేను శుక్రవారం విడుదల చేశారు. అందులోకి కొన్ని ముఖ్యాంశాలు కింది విధంగా ఉన్నాయి.

స్థిరమైన జీడీపీ వృద్ధి: అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో  6.3 నుంచి 6.8 శాతం ఉంటుందని అంచనా వేశారు. ఇది దశాబ్ద సగటుకు దగ్గరగా ఉంది.

రంగాలవారీ పనితీరు: వ్యవసాయం, పరిశ్రమలు, సేవలతో సహా అన్ని రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి. వ్యవసాయ రంగం బలంగా ఉంది.

ద్రవ్యోల్బణం నియంత్రణ: రిటైల్ ద్రవ్యోల్బణం 2024 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 4.9 శాతానికి తగ్గింది.

బ్యాంకింగ్ రంగం: వాణిజ్య బ్యాంకులు తమ స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తిలో స్థిరమైన తగ్గుదలను నమోదు చేశాయి. ఇది 2024 సెప్టెంబర్ చివరి నాటికి 2.6% కనిష్టానికి చేరుకుంది.

గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్: గ్లోబల్ ఐపీఓ లిస్టింగ్స్‌లో భారత్ వాటా 2023లో 17 శాతం నుంచి 2024 నాటికి 30 శాతానికి చేరింది.

మూలధన వ్యయం: 2024 నవంబర్ వరకు మొత్తం మూలధన వ్యయంలో రక్షణ, రైల్వేలు, రోడ్డు రవాణా వాటా 75 శాతంగా ఉంది.

ఆహార ద్రవ్యోల్బణం: కూరగాయల ధరల కాలానుగుణంగా భారీ ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఖరీఫ్ సీజన్ వస్తుండడంతో ఆహార ద్రవ్యోల్బణం 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి తగ్గుతుందని భావిస్తున్నారు.

బీమా రంగ వృద్ధి: బీమా రంగం 2024 ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్ధి చెంది మొత్తం ఎఫ్‌డీఐల్లో 62% ఆకర్షించింది.

హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్: భారత బీమా రంగం వృద్ధికి ఆరోగ్యం, మోటారు బీమా గణనీయంగా దోహదపడ్డాయి.

	పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే

ఇదీ చదవండి: తగ్గిన జీడీపీ వృద్ధి అంచనా

  • నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది. అయితే వృద్ధిరేటు కొనసాగేందుకు క్షేత్రస్థాయి సంస్కరణలు కొనసాగాలి. ప్రపంచస్థాయిలో పోటీపడే దిశగా మెరుగుపడాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సరైన యంత్రాంగం లేకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

  • భౌగోళిక, రాజకీయ అస్థిరతల వల్ల డాలర్ బలపడడంతో రూపాయి మారక విలువ పడిపోయింది. 2025లో స్టాక్‌ మార్కెట్‌లు కొంత పడిపోయే అవకాశం ఉంది.
     

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)