హెల్మెట్ ధరించనందుకు రూ.21 లక్షల ఫైన్!

Published on Sat, 11/08/2025 - 21:18

హెల్మెట్ ధరించకపోతే రూ. 500 లేదా రూ. 1000 చలాన్ విధిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించనందుకు దాదాపు రూ. 21 లక్షల చలాన్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెల్మెట్ ధరించనందుకు వచ్చిన రూ.20,74,000 చలాన్ చూసి స్కూటర్ రైడర్ అన్మోల్ సింఘాల్‌ ఒక్కసారిగా షాకయ్యాడు. న్యూ మండి ప్రాంతంలో పోలీసులు తనిఖీ చేస్తున్న సమయంలో సింఘాల్‌.. హెల్మెట్ ధరించకపోగా, అతని వద్ద సరైన డాక్యుమెంట్స్ కూడా లేదని పోలీస్ అధికారి పేర్కొన్నారు.

పోలీస్ అధికారి స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని.. రూ.20,74,000 జరిమానా విధించాడు. ఇది చూసి షాకయిన రైడర్ ఆ చలాన్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తప్పు తెలుసుకున్న పోలీస్ అధికారి.. ఆ చలాన్ మొత్తాన్ని రూ.4,000 కు సరిచేశారు. దీనిపై ముజఫర్ నగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అతుల్ చౌబే స్పందించారు.

చలాన్ జారీ చేసిన సబ్-ఇనస్పెక్టర్ చేసిన పొరపాటు వల్ల జరిమానా తప్పుగా జారీ చేశారు. ఈ కేసు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207కు వర్తిస్తుంది. అయితే ఇనస్పెక్టర్ 207 తర్వాత 'ఎంవీ యాక్ట్' అని పేర్కొనడం మర్చిపోయారు. దీంతో రెండూ కలిసిపోయి.. రూ. 2074000గా చలాన్ విధించారు. అయితే రైడర్ చెల్లించాల్సిన ఫైన్ రూ. 4000 మాత్రమే అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనవంతులయ్యే మార్గాలు

Videos

నారా లోకేష్ పై గోరంట్ల మాధవ్ ఫైర్

షూ చూశారా.. నన్ను టచ్ చేస్తే.. ఒక్కొక్కడికీ..

రైతును రాజు చేసింది YSR.. అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ హయాంలో

అనంతలో టీడీపీ బీభత్సం.. YSRCP కార్యకర్తలపై కర్రలతో దాడి

వివేక్ రామస్వామికి డోనాల్డ్ ట్రంప్ మద్దతు

శివ సినిమా చిరంజీవి చేసి ఉంటే..

ఇది ఆరంభం మాత్రమే.. ఎల్లో మీడియా గుట్టువిప్పుతున్న సోషల్ మీడియా

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లేడీ Vs రౌడీ.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ నేతలు

బుద్దుందా మీకు..

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)