Breaking News

ఆరోగ్య బీమా.. పాలసీ సంస్థ మారుతున్నారా?

Published on Sat, 11/30/2024 - 12:28

మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతోంది. ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా మంది ఆరోగ్య బీమాను ఎంచుకుంటున్నారు. అయితే ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ ప్రస్తుతం మారుతున్న విధానాలకు అనుగుణంగా లేకపోవచ్చు. మార్కెట్‌లో పోటీ నెలకొని ఇతర కంపెనీలు తక్కువ ప్రీమియంతో మరింత మెరుగైనా సదుపాయాలుండే పాలసీని అందిస్తుండవచ్చు. అలాంటి సందర్భంలో పాలసీను రద్దు చేసుకోకుండా ‘పోర్టబిలిటీ’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీనివల్ల పాలసీను వేరే కంపెనీకి మార్చుకోవచ్చు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

ఇన్సూరెన్స్‌ కంపెనీల మధ్య పోటీని పెంచడానికి, పాలసీదారులకు మెరుగైన సేవలను అందించడానికి భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ‘పోర్టబిలిటీ’ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వెయిటింగ్‌ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్య బీమా పాలసీని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకోవచ్చు.

  • ప్రస్తుత పాలసీ నిబంధనలు, షరతులు మీ అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు పోర్ట్‌కు ప్రయత్నించాలి.

  • పాలసీ చెల్లించే విలువ తక్కువగా ఉంటూ, ప్రీమియం అధికంగా ఉన్నప్పుడు పోర్ట్‌ను పరిశీలించవచ్చు. అయితే అందులో అధిక క్లెయిమ్‌ ఇచ్చే సంస్థలను ఎంచుకుంటే ఉత్తమం.

  • స్థానిక ఆసుపత్రులు బీమా సంస్థ నెట్‌వర్క్‌ కవరేజ్‌ జాబితాలో లేనప్పుడు ఈ విధానాన్ని పరిశీలించాలి.

  • ప్రస్తుతం పాలసీ ఉన్న బీమా సంస్థను మార్చుకోవాలని నిర్ణయించుకుంటే పాలసీ రెన్యువల్‌ చేయడానికి 45 రోజుల ముందే అవసరమైన చర్యలు ప్రారంభించాలి.

  • ప్రస్తుతం చాలా సంస్థలు రెన్యువల్‌కు ఒక రోజు ముందు, పాలసీ గడువు ముగిసిన 15-30 రోజుల వరకూ పోర్ట్‌ చేసుకునేందుకు అనుమతిస్తున్నాయి.

  • పోర్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడమే మేలు.

  • తీరా పాలసీ పునరుద్ధరణ గడువు ముగిసిన తర్వాత కొత్త సంస్థ పాలసీని ఇవ్వలేమంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

గమనించాల్సినవి..

పాలసీని పోర్ట్‌ పెట్టాలనుకున్నప్పుడు ప్రధానంగా బీమా మొత్తంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. ఉదాహరణకు మీకు ఒక బీమా సంస్థలో రూ.5లక్షల పాలసీ ఉందనుకుందాం. బోనస్‌తో కలిపి ఈ మొత్తం రూ.7.50లక్షలు అయ్యింది. కొత్త బీమా సంస్థకు మారి, రూ.10 లక్షల పాలసీ తీసుకున్నారనుకుందాం. అప్పుడు కొత్త సంస్థ రూ.7.5 లక్షల వరకే పాత పాలసీగా భావిస్తుంది. మిగతా రూ.2.5 లక్షలను కొత్త పాలసీగానే పరిగణిస్తుంది. ఈ మొత్తానికి సంస్థ నిబంధనల మేరకు వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. దీనికి ఇతర  షరతులూ వర్తిస్తాయి.

ఇదీ చదవండి: 13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్‌

వివరాలు అన్నీ తెలపాలి..

కొత్త సంస్థకు మారేటప్పుడు ఇప్పటికే ఉన్న పాలసీలో మీరు చేసిన క్లెయిమ్‌ వివరాలు స్పష్టంగా చెప్పాలి. ఆరోగ్యం, ఇప్పటికే తీసుకున్న చికిత్సల గురించీ వివరించాలి. పాలసీ ఇవ్వరు అనే ఆలోచనతో చాలామంది ఇవన్నీ చెప్పరు. కానీ, పాలసీ వచ్చిన తర్వాత ఇవి బయటపడితే పరిహారం లభించదు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి