Breaking News

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మార్చుకోవాలనుకుంటున్నారా?

Published on Mon, 08/03/2026 - 15:06

ఆర్థిక ప్రణాళికలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనలో చాలామందికి ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఆరోగ్య బీమా ఉంటోంది. అయితే, జీవితంలో వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా ఆదాయం పెరగడం వంటి మార్పులకు అనుగుణంగా బీమా ప్రయోజనాలు కూడా మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బేసిక్‌ వ్యక్తిగత పాలసీతో ప్రారంభించి ఉండవచ్చు. తర్వాత, వివాహమయ్యాక జీవిత భాగస్వామిని కూడా ఇన్సూరెన్స్‌ పరిధిలో చేర్చాలని లేదా మరింత ఎక్కువ కవరేజీతో పాటు యాడ్‌–ఆన్‌లు ఉన్న పాలసీని ఎంచుకోవాలనుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని మార్చుకోవడమో లేదా బదిలీ చేయడమో గురించి ఆలోచించవచ్చు. ఇక్కడే మైగ్రేషన్, పోర్టింగ్‌ అనే పరిభాష తెరపైకి వస్తుంది.  

మైగ్రేషన్‌ అంటే ఏమిటి? 
మైగ్రేషన్‌ అంటే మీ ప్రస్తుత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను అదే ఇన్సూరెన్స్‌ కంపెనీలో అప్‌గ్రేడ్‌ చేయడం. దీని ద్వారా మీ ప్రస్తుత బీమా సంస్థ మరింత విస్తృతంగా కవరేజ్‌ అందించే ప్లాన్‌కి మారవచ్చు లేదా మీ కుటుంబంలో కొత్త సభ్యులను కూడా పాలసీలో చేర్చుకోవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే, మైగ్రేషన్‌ అంటే అదే కంపెనీలో ఉంటూ మెరుగైన ప్లాన్‌కి మారడం.

పోర్టింగ్‌ అంటే ఏమిటి? 
పోర్టింగ్‌ అంటే మీ ఆరోగ్య బీమా పాలసీని ఒక కంపెనీ నుండి మరొక సంస్థకి బదిలీ చేయడం. మీ అవసరాలకు సరిపోయే మెరుగైన ప్రయోజనాలు లేదా సేవలను మరో బీమా సంస్థ అందిస్తే, మీరు పోర్టింగ్‌ను ఎంచుకోవచ్చు. మీ ప్రస్తుత ఇన్సూరర్‌ సేవలపై అసంతృప్తి ఉన్నప్పుడు లేదా వేరే చోట మీ అవసరాలకు తగ్గట్లు మరింత అనుకూలమైన ప్లాన్‌ దొరికినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఎంచుకోవడం ఇలా.. 
మైగ్రేషన్‌: మీరు మైగ్రేట్‌ అయినప్పుడు, అదే బీమా కంపెనీలో ఒక పాలసీ నుండి మరో పాలసీకి మారతారు. మీ వివరాలు అప్పటికే ఇన్సూరర్‌ వద్ద ఉండటం వల్ల ఈ ప్రాసెస్‌ సాధారణంగా సులభంగా ఉంటుంది. దీని వలన కీలక ప్రయోజనాలు ఏమిటంటే వెయిటింగ్‌ పీరియడ్‌ క్రెడిట్‌లు, బోనస్‌ల వంటి కొనసాగుతున్న ప్రయోజనాలు యథాతథంగా ఉంటాయి. మీ ఇన్సూరర్‌ నిబంధనలకు లోబడి, మైగ్రేషన్‌కి సాధారణంగా ఏ సమయంలోనైనా వీలుంటుంది. మీ ఇన్సూరర్‌ సేవలతో మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ, మరింత కవరేజ్‌ లేదా అదనపు ఫీచర్లు కావాలనుకుంటే, తక్కువ రిస్‌్కతో దీనిని ఎంచుకోవచ్చు.

పోర్టింగ్‌: ఈ విధానంలో మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కొత్త బీమా సంస్థకి బదిలీ అవుతుంది. ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం, మీకు ఇప్పటికే లభించే ప్రయోజనాలు, అంటే వెయిటింగ్‌ పీరియడ్‌ క్రెడిట్‌లు, బోనస్‌లు వంటి వాటిని కోల్పోకుండా కొనసాగిస్తారు. కొత్త ఇన్సూరర్‌ మీ ఆరోగ్య స్థితి, దరఖాస్తును పరిశీలిస్తారు. వాటి ఆధారంగా ప్రీమియం పెరగవచ్చు లేదా పెరగకపోవచ్చు. పాలసీ రెన్యూవల్‌ సమయంలో మాత్రమే పోర్టింగ్‌ చేయవచ్చు. మీ ప్రస్తుత పాలసీ ముగియడానికి 30–60 రోజుల ముందు దరఖాస్తు చేయాలి. మీ ప్రస్తుత బీమా కంపెనీ అందించే సేవలు, క్లెయిమ్‌ ప్రాసెస్‌ లేదా ప్రీమియంలపై అసంతృప్తిగా ఉంటే, ఇతర ఆప్షన్లను పరిశీలించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

ఇది గుర్తుంచుకోవాలి
మైగ్రేషన్, పోర్టింగ్‌ రెండూ మీ అవసరాలు మారుతున్న కొద్దీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను సర్దుబాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి. అయితే, ఆలోచన లేకుండా తొందరపడి ఇన్సూరర్‌ను మార్చడం చేయకూడదు. అలాగే, మైగ్రేట్‌ చేయాలా లేదా పోర్ట్‌ చేయాలా అనే నిర్ణయం తీసుకునే ముందు ఆయా బీమా సంస్థలు అందించే అదనపు ప్రయోజనాలు, సేవలను జాగ్రత్తగా పరిశీలించండి. మీ అవసరాలకు ఏ మార్గం అత్యంత అనుకూలంగా ఉంటుందో ఖచ్చితంగా తెలియకపోతే, మీ ఇన్సూరెన్స్‌ సంస్థను లేదా విశ్వసనీయ సలహాదారుని సంప్రదించి తగిన సలహా తీసుకోండి. ఏది చేసినా దీర్ఘకాలికంగా ఆరోగ్య రక్షణకు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని తీసుకోండి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)