Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యూపీఐ.. ఈ రెండు రోజుల్లో పనిచేయదు

Published on Sun, 11/03/2024 - 10:51

యూపీఐ సేవలకు సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తమ కస్టమర్లకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. అవసరమైన సిస్టమ్ నిర్వహణ కారణంగా నవంబర్‌లో రెండు రోజుల పాటు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవ అందుబాటులో ఉండదని ప్రకటించింది.

కస్టమర్ల బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నవంబర్ 5, 23 తేదీలలో అవసరమైన సిస్టమ్ నిర్వహణ పనులు చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది. నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుండి 2 గంటల వరకు, అలాగే నవంబర్ 23న అర్ధరాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు అంతరాయం ఉంటుందని వెల్లడించింది.

ఈ సేవలు అందుబాటులో ఉండవు
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కరెంట్ & సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్‌పై ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ హ్యాండిల్‌ని వినియోగించే హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్, గూగుల్‌పే, వాట్సాప్‌ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మొబిక్విక్‌, క్రెడిట్‌ పేలో ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ యూపీఐ లావాదేవీలు.
» హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ని వినియోగించే మర్చంట్‌ల వద్ద కూడా యూపీఐ లావాదేవీలు అందుబాటులో ఉండవు.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌.. ఉచితంగా క్రెడిట్‌ కార్డులు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)