Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవలు రెండు రోజులు బంద్‌

Published on Fri, 08/22/2025 - 09:02

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించిన కొన్ని సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. వాట్సాప్ ద్వారా చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లు ఆగస్టు 22, 23 తేదీల్లో స్వల్ప కాలానికి అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్ కేర్ సేవలకు కూడా అంతరాయం కలగనుంది.

ఖాతాదారులకు మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వ్యవస్థల నిర్వహణను చేపడుతున్నందున ఈ సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. "మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నాం" అని బ్యాంక్ ఒక నోటీసులో తెలిపింది.

దీంతో కొన్ని బ్యాంకింగ్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో ఉండవు. ఈ కాలంలో కస్టమర్ కేర్ సేవలు (ఫోన్ బ్యాంకింగ్ ఐవీఆర్, ఈమెయిల్ & సోషల్ మీడియా), వాట్సాప్‌లో చాట్‌ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.

మెయింటెనెన్స్ పీరియడ్ లో  ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మై కార్డ్స్ సేవలు  మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం వివరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)