Breaking News

అతిపెద్ద బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవలు రెండు రోజులు బంద్‌!

Published on Fri, 06/07/2024 - 15:30

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆన్‌లైన్‌ సేవలు ఈ నెలలో రెండు వేర్వేరు తేదీల్లో కొన్ని గంటలపాటు నిలిచిపోనున్నాయి. బ్యాంక్‌ మరోసారి మెయింటెనెన్స్ షెడ్యూల్ ను ప్రకటించడంతో పలు కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.

(అదానీ వారి క్రెడిట్‌ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్‌!)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన ప్రకారం.. బ్యాంక్ తన ప్లాట్‌ఫామ్‌లను జూన్‌ నెలలో రెండు వేర్వేరు తేదీలలో అప్‌గ్రేడ్‌ చేయనుంది. దటి షెడ్యూల్ మెయింటెనెన్స్ జూన్ 9న తెల్లవారుజామున 3:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో జరుగుతుంది. రెండో మెయింటెనెన్స్ జూన్ 16న  ఉదయం 3:30 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు నాలుగు గంటల పాటు ఉంటుంది. ఈ కాలంలో పలు సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండవు.

ప్రభావితమయ్యే సేవలు ఇవే..

» ఖాతా సంబంధిత సేవలు
»  డిపాజిట్లు
» నిధుల బదిలీలు (ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్)
» అకౌంట్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్స్‌
» ఎక్స్‌టర్నల్‌/మర్చంట్ చెల్లింపు సేవలు
» ఇన్‌స్టాంట్‌ అకౌంట్‌ ఓపెనింగ్‌
» యూపీఐ చెల్లింపులు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత మే 25న కూడా బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాల కోసం నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐతో సహా చాలా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. షెడ్యూల్ మెయింటెనెన్స్‌తో పాటు యూపీఐ లావాదేవీల ఎస్ఎంఎస్ అలర్ట్ సిస్టమ్‌లోనూ బ్యాంక్‌ మార్పులు చేసింది. జూన్ 25 నుంచి రూ .100 కంటే తక్కువ విలువ యూపీఐ లావాదేవీలకు ఎస్ఎంఎస్ అలర్ట్‌లను బ్యాంక్‌ కస్టమర్లకు పంపదు. అయితే రూ.100, అంతకంటే ఎక్కువ విలువ యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కొనసాగుతాయి.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)