Breaking News

హోమ్‌లోన్‌పై గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త రుణాలు

Published on Fri, 02/16/2024 - 09:15

HDFC Bank Home Loans : దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ హోమ్‌ లోన్‌పై గుడ్‌న్యూస్‌ చెప్పింది. కస్టమర్లకు త్వరలో రెండు కొత్త లోన్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో ‘హోమ్ సేవర్ ప్రొడక్ట్‌’ పేరిట ఓ లోన్‌ను ఏప్రిల్‌లో, హోమ్ రిఫర్బిష్‌మెంట్ లోన్‌లను రాబోయే నెలల్లో ప్రారంభించాలని యోచిస్తోందని బ్యాంక్ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.

హోమ్ సేవర్ ప్రొడక్ట్‌ అనేది ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఎస్‌బీఐ అందిస్తున్న  మ్యాక్స్‌గెయిన్ హోమ్ లోన్ స్కీమ్‌కి పోటీగా దీన్ని భావించవచ్చు. ఇక హోమ్‌ రీఫర్బిష్‌మెంట్‌ లోన్‌ విషయానికి వస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో విలీనానికి ముందు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఈ లోన్‌ను అందించేది. ఇప్పుడు ఈ లోన్‌ను త్వరలో పునఃప్రారంభిస్తున్నారు.

ఈ రెండు లోన్లు ఇప్పటికే ఉన్న కస్టమర్లతోపాటు కొత్త కస్టమర్లకు అందించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్టగేజ్‌ బ్యాంకింగ్, హోమ్ లోన్, ల్యాప్ కంట్రీ హెడ్  అరవింద్ కపిల్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే బ్యాంకు గృహ రుణాలపై వసూలు చేసే రేటు కంటే హోమ్ రిఫర్బిష్‌మెంట్ లోన్ 100 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుతో లింక్‌ అయిన గృహ రుణాలపై 8.55 నుంచి 9.10 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. కాగా ఇప్పటివరకూ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ సర్వీస్‌ సెంటర్లను దశలవారీగా బ్యాంక్‌ బ్రాంచ్‌లుగా మార్చబోతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)