Breaking News

తగ్గనున్న ఈఎంఐ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గుడ్‌న్యూస్‌

Published on Wed, 01/08/2025 - 20:15

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన లోన్ కాలపరిమితి కోసం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు తగ్గింపును ప్రకటించింది. జనవరి 7 నుండి అమలులోకి వచ్చిన సవరించిన రేట్లు ఇప్పుడు 9.15 శాతం నుంచి 9.45 శాతం మధ్య ఉంటాయి.

ఎంసీఎల్‌ఆర్‌ తగ్గింపు ద్వారా రుణగ్రహీతలకు వారి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన వ్యక్తిగత, వ్యాపార రుణాల వంటి ఫ్లోటింగ్ రేటు రుణాలపై సమానమైన నెలవారీ వాయిదాలు (EMI) కూడా తగ్గుతాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజా ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్‌ఆర్‌ని 9.20 శాతం నుండి 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించి 9.15 శాతానికి సవరించింది. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు ఎటువంటి మార్పు లేకుండా వరుసగా 9.20 శాతం, 9.30 శాతంగా ఉన్నాయి.

అదే విధంగా ఆరు నెలలు, ఏడాది, మూడు సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు ఒక్కొక్కటి 5 బేసిస్‌ పాయింట్లు చొప్పున తగ్గి 9.45 శాతంగా ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల ఎంసీఎల్‌ఆర్‌ 9.45 శాతం వద్ద యథాతథంగా ఉంది.

ఎంసీఎల్‌ఆర్‌ అంటే?
"ఎంసీఎల్‌ఆర్‌ అనేది ఒక నిర్దిష్ట రుణానికి ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటు. ఇది రుణంపై వడ్డీ రేటు కనీస పరిమితిని నిర్ణయిస్తుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్తే తప్ప తప్ప ఇందులో మార్పు ఉండదు" అని ఎంసీఎల్‌ఆర్‌ భావనను వివరిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

పీఎల్‌ఆర్‌ ఇలా..
ఎంసీఎల్‌ఆర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (PLR) సంవత్సరానికి 17.95 శాతం ఉంది. ఇది 2024 సెప్టెంబర్ 9 నుండి అమలులోకి వచ్చింది. నిర్దిష్ట రుణాలకు వర్తించే బేస్ రేటును అదే తేదీ నాటికి 9.45 శాతంగా నిర్ణయించారు.

ఈబీఎల్‌ఆర్‌ 
గృహ రుణాల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్ (EBLR)ని అనుసరిస్తుంది. ఇది పాలసీ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. ప్రస్తుత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. ఇక అడ్జస్టబుల్ రేట్ హోమ్ లోన్స్ (ARHL) వడ్డీ రేట్లు లోన్ వ్యవధిలో మారుతూ ఉంటాయి.

హోమ్ లోన్ రేట్లు
ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు తీసుకునే ప్రత్యేక గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.75 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంటాయి. రెపో రేటుతో పాటు 2.25 శాతం నుండి 3.15 శాతం అదనపు మార్జిన్ ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. ఇక ఇదే కేటగిరీకి చెందిన రుణగ్రహీతలకు ప్రామాణిక గృహ రుణ రేట్లు 9.40 శాతం నుండి 9.95 శాతం వరకు ఉంటాయి. వీటిలో రెపో రేటుతో పాటు 2.90 శాతం నుండి 3.45 శాతం మార్జిన్‌ కలిసి ఉంటాయి.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)