Breaking News

EMIలు తగ్గుతాయ్‌.. లోన్‌ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..

Published on Mon, 04/07/2025 - 17:27

దేశంలోని రుణగ్రహీతలకు శుభవార్త. అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) తన ఎంసీఎల్ఆర్ (వడ్డీ రేటు)ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. సవరించిన తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 9.10 శాతం నుంచి 9.35 శాతం మధ్య ఉంటుంది. సవరించిన రేట్లు ఏప్రిల్ 7 నుంచి వర్తిస్తాయి.

ఎంసీఎల్ఆర్.. దాని ప్రభావం
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ లేదా ఎంసీఎల్ఆర్ అనేది ఒక నిర్దిష్ట రుణం కోసం బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటు. ఇది రుణానికి వడ్డీ రేటు తక్కువ పరిమితిని నిర్దేశిస్తుంది. ఆర్బీఐ 2016లో ఎంసీఎల్ఆర్‌ను ప్రవేశపెట్టింది.

గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో సహా వివిధ ఫ్లోటింగ్-రేట్ రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే బెంచ్‌మార్క్ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. ఈ ఎంసీఎల్ఆర్ తగ్గడం వల్ల రుణ ఈఎంఐలు లేదా రుణ కాలపరిమితి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలికంగా రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఈ ప్రయోజనం పరిధి, సమయం రుణ ఒప్పందంలో పేర్కొన్న రీసెట్ క్లాజ్‌పై ఆధారపడి ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ రేట్లు
ఓవర్నైట్, ఒక నెల ఎంసీఎల్ఆర్ కాలపరిమితిని 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.20 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్‌ను 9.30 శాతం నుంచి 9.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. ఏడాది, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.40 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గించింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ను 9.45 శాతం నుంచి 9.35 శాతానికి తగ్గించింది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)