Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోనస్‌ బొనాంజా!

Published on Thu, 07/17/2025 - 16:24

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీ సహా.. ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ నెల 19న(శనివారం) నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు బ్యాంక్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక (ఏప్రిల్‌–జూన్‌) ఫలితాలను సైతం శనివారం సమావేశంలో బ్యాంక్‌ ప్రకటించనుంది. కాగా.. గతేడాది(2024–25)కి ప్రచురించిన వార్షిక నివేదికలో పరిశ్రమకు అనుగుణంగా ఈ ఏడాది రుణాల్లో వృద్ధి నమోదుకానున్నట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశిధర్‌ జగదీశన్‌ పేర్కొన్నారు.

రుణ రేట్లను తగ్గించిన ఐవోబీ 
ప్రభుత్వరంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ) మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్‌) 10 బేసిస్‌ పాయింట్ల (0.10 శాతం) మేర తగ్గించినట్టు ప్రకటించింది. అన్ని రకాల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ రుణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.

జూలై 15 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. సవరణ అనంతరం ఓవర్‌నైట్‌ కాల వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ 8.15 శాతం, ఒక నెల ఎంసీఎల్‌ఆర్‌ 8.40%, మూడు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.55 శాతం, ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 8.80 శాతం, ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 9 శాతానికి దిగొచ్చాయి. ఆటో, వ్యక్తిగత తదితర కన్జ్యూమర్‌ రుణాలకు ఎంసీఎల్‌ఆర్‌ను బ్యాంకులు అమలు చేస్తుంటాయి.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)