Breaking News

క్రెడిట్‌ కార్డుల్లో హెచ్‌డీఎఫ్‌సీ రికార్డు!

Published on Wed, 01/24/2024 - 12:38

దేశంలో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. వినియోగంలో ఉన్న రెండు కోట్ల క్రెడిట్ కార్డుల మైలురాయిని సాధించిన తొలి బ్యాంక్‌గా  నిలిచింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆర్‌బీఐ డేటా ప్రకారం.. అన్ని బ్యాంకులు మొత్తంగా జారీ చేసిన 9.6 కోట్ల క్రెడిట్‌ కార్డులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ దాదాపు 21 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక కార్డు వ్యయాల్లో 2023 మార్చి 31 నాటికి తమ వాటా 28.6 శాతం ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. 

లేటుగా ప్రారంభించినా..
క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించిన ప్రధాన బ్యాంకులలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చివరిది కావడం గమనార్హం. ఎస్‌బీఐ తన కార్డ్ వ్యాపారాన్ని 1997లో ప్రారంభించగా ఐసీఐసీఐ బ్యాంక్ 2000లో క్రెడిట్‌ కార్డులు తీసుకొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2001లో తన కార్డ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఇతర బ్యాంకులు మందగించినప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాత్రం ఓ వైపు కస్టమర్లతోపాటు మరోవైపు వ్యాపారులపైనా దృష్టి పెడుతూ స్థిరంగా దాని పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోగలిగింది. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలో 90లలో సిటీ బ్యాంక్ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత దేశీయ ప్రైవేట్ బ్యాంకులు విస్తరించడంతో విదేశీ బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోయాయి.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)