Breaking News

భారత్‌లో అత్యంత సంపన్న మహిళ.. 'రోష్ని నాడార్‌' ఆస్తి ఎంతో తెలుసా?

Published on Wed, 07/27/2022 - 20:27

ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం కొటక్‌ మహీంద్రా - హురున్‌ ఇండియా సంస్థలు సంయుక్తంగా భారత్‌లోనే అత్యంత సంపన్నులైన 100 మంది మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రోష్ని నాడార్‌, ఫల్గుణి నాయర్‌లు వరుస స్థానాల్ని దక్కించుకున్నారు.  

సంపన్నుల జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌ పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330కోట్లతో  తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

♦ బ్యాంకింగ్‌ రంగం నుంచి అనూహ్యంగా నైకా పేరుతో కాస్మోటిక్స్‌ రంగంలో రాణిస్తున్న ఫల్గుణి నాయర్‌ రూ.57,520 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో ఆమె వెల్త్‌ 963 శాతం పెరిగినట్లు విడుదలైన నివేదిక పేర్కొంది. 

బయోకాన్‌ ఛైర్‌ పర్సన్‌ కిరణ్‌ మంజుదార్‌ షా వెల్త్‌ 21శాతం తగ్గి రూ.29,030 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు.  

హైదరాబాద్‌లో 12మంది మహిళలు
మహిళా సంపన్నుల జాబితాలో అత్యధికంగా ఢిల్లీ నుంచి  25 మంది, ముంబై నుంచి 21మంది ,హైదరాబాద్ నుంచి 12 మంది ఉన్నారు. భారతదేశంలోని టాప్ - 100 మంది ధనవంతులైన మహిళలలో ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి 12 మంది, హెల్త్‌కేర్ నుంచి  11 మంది, కన్స్యూమర్ గూడ్స్ రంగం  నుంచి 9 మంది మహిళలున్నారు. 

హైదరాబాద్‌లో దివీస్‌ లాబోరేటరీస్‌ డైరక్టర్‌ నీలిమా రూ.28,180కోట్లతో తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రూ.5,530కోట్లతో బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల, రూ.2,740కోట్లతో శోభన కామినేని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

చివరిగా భోపాల్‌ జెట్‌సెట్‌గోకు చెందిన 33ఏళ్ల కనికా తెక్రివాల్‌ 50 శాతం సంపదతో రూ.420 కోట్లతో జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు.  

సంస్థల్లో ఉన్నత స్థాయిలో..
సంపన్నుల జాబితాలో ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన మహిళలు సైతం ఉన్నారు. వారిలో మాజీ పెప్సికో సీఈవో  ఇంద్రా నూయి రూ. 5,040 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రేణు సుద్ కర్నాడ్ రూ. 870 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ శాంతి ఏకాంబరం రూ.320 కోట్లతో వరుస స్థానాల్ని కైవసం చేసుకున్నారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)