Breaking News

అప్పులు కావవి విష ప్రచారం..ఇదీ నిజం!

Published on Wed, 07/26/2023 - 12:00

సాక్షి, అమరావతి:  అప్పులు అప్పులు అంటూ ఆంధ్రప్రదేశ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన వారికి కేంద్రం ప్రటించిన నివేదిక చెంపపెట్టుగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాలలో తమిళనాడు అత్యధిక రుణ బకాయిలున్న రాష్ట్రంగా నిలిచింది.

2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్‌- ఎస్‌డీఎల్‌) బకాయిలు రూ.7.54 లక్షల కోట్లుగా ఉండగా, దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్  అప్పు  రూ.7.10 లక్షల కోట్లకు చేరుకుందని  పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా తెలిపారు. గడిచిన మూడు ఆర్ధిక సంవత్సరాల్లో (2020 -2023) అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలోనూ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్ర, వెస్ట్‌ బెంగాల్‌, రాజస్థాన్‌  కర్ణాటక, ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

సంఖ్య రాష్ట్రం తీసుకున్న అప్పు
1 తమిళనాడు రూ.7.54 లక్షల కోట్లు
2 ఉత్తర ప్రదేశ్ రూ.7.10 లక్షల కోట్లు
3 మహారాష్ట్ర రూ.6.80 లక్షల కోట్లు
4 పశ్చిమ బెంగాల్ రూ.6.08 లక్షల కోట్లు
5 రాజస్థాన్ రూ.5.37 లక్షల కోట్లు
6 కర్ణాటక రూ.5.35 లక్షల కోట్లు

రాష్ట్రం అప్పుల పాలైందని దుష్ప్రచారం చేసే విపక్షాలు కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో చెప్పిన సమాధానం చూసైనా మారాలని  వైఎస్సార్‌ సీపీ  ఎంపీ విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. 2019 మార్చినాటికే రాష్ట్రానికి రూ.2,64,451 రుణభారం ఉండగా ఈ నాలుగేళ్లలో అభివృద్ధి పనుల కోసం తీసుకున్నది కేవలం 1,77,991 కోట్లేనని ఆయన వివరించారు. ఈ వాస్తవాలను విస్మరించి 10 లక్షల కోట్ల అప్పు అంటూ ప్రచారం చేయడం దుర్మార్గం  కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు విజయ సాయిరెడ్డి బుధవారం ట్వీట్‌ చేశారు.

లోక్‌సభలో ఖమ్మం బీఆర్ఎస్ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  లిఖిత  పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేషన్లు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు సీతారామన్.  దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లు అప్పు ఉంటే 2023 మార్చి నాటికి బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లుగా ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)