Breaking News

ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ లబోదిబో

Published on Wed, 06/07/2023 - 17:36

ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించి ఖరీదైన కారును పోగొట్టుకున్న వైనం  ఒకటి తాజాగా  వెలుగులోకి  వచ్చింది. గుజరాతీ గాయకుడు ,సంగీత దర్శకుడు, బిన్నీ శర్మ  రూ. 40 లక్షల విలువైన  ఎప్‌యూవీని  పోగొట్టకుని లబోదిబోమంటున్నాడు.  ఈ మేరకు తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది  వైరల్‌ అవుతోంది.  (అతిపెద్ద లిక్కర్‌ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్‌ ఇక లేరు)
  
తన పాటలు, వాయిస్‌తో గాయకుడిగా పాపులర్‌ అయిన బిన్నీ గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఫేక్‌ పోర్ట్‌ల్‌ ద్వారా మోసానికి గురయ్యాడు.  తాను సాధారణంగా సహాయం కోసం అడగను,  కానీ మోసగాడు చేసిన స్కామ్‌కు బలైపోయా.. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను సాయం చేయాలంటూ ఇన్స్టా వేదికగా   కోరుతున్నాడు. అలాగే మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి,  మోస పోవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం. 

రూ.40 లక్షలు విలువ చేసే తన ఎస్‌యూవీని  హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ మూవ్ మై కార్ అనే పోర్టల్ లో వెండర్‌ను సంప్రదించాడు. ఈ మేరకు సదరు వెండర్‌కు చెందిన ట్రక్‌ శర్మ కారును తీసుకెళ్లింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. తీసుకెళ్లి కారును మాత్రం గమ్యస్థానానికి చేర్చలేదు. పైగా  ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన  సొమ్ముకాకుండా అధికంగా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గమనించిన బిన్నీ పోలీసులను ఆశ్రయించాడు.   అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్‌పై కూడా సైబర్ పోలీసులు కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశానని బిన్నీ తెలిపారు. అటు పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. (ఐవోఎస్‌ 17 అదిరిపోయే అప్‌డేట్‌: ఈ పాపులర్‌ ఐఫోన్‌ యూజర్లకు మాత్రం) 

కాగా రేడియో జాకీగా తొలినాళ్ల నుంచి 'మై వరల్డ్' అనే షోను హోస్ట్ చేస్తూ సునిధి చౌహాన్, శంకర్ ఎహసాన్ లాయ్,  అర్జిత్‌ సింగ్ వంటి పాపులర్‌ సింగర్స్‌తో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, తన టాలెంట్‌తో అనేక మంది ఫ్యాన్స్‌ని, ఫాలోయర్స్‌ని  సంపాదించకున్నాడు బిన్నీ శర్మ.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)