Breaking News

జులై జీఎస్టీ వసూళ్లు.. 14 నెలల కాలంలోనే గరిష్ఠం

Published on Sat, 08/01/2026 - 12:04

భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి పయనంలో దూసుకుపోతోందనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం జులై నెలలో స్థూల జీఎస్టీ రాబడి 15.4 శాతం వృద్ధితో రూ.2.11 లక్షల కోట్లకు చేరింది. గత 14 నెలల కాలంలోనే ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం.

దిగుమతుల జోరు, నికర ఆదాయంలో ఊపు

అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలు పుంజుకోవడంతో దిగుమతులపై వచ్చే జీఎస్టీ వసూళ్లు ఏకంగా 28.8% పెరిగి రూ.66,511 కోట్లకు ఎగబాకాయి. ఇక స్వదేశీ లావాదేవీల ద్వారా లభించిన రాబడి 10.1 శాతం పెరిగి రూ.1.45 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యాపారులకు ఇచ్చే రీఫండ్లను మినహాయించిన తర్వాత ప్రభుత్వానికి లభించిన నికర జీఎస్టీ రాబడి 15.8% వృద్ధితో రూ.1.81 లక్షల కోట్లకు చేరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్-జులై) స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ-ఇన్వాయిసింగ్ విధానం పక్కాగా అమలుకావడం, డేటా విశ్లేషణ ద్వారా పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేయడం ఆదాయానికి ప్రధాన చోదకాలుగా నిలిచాయి. వచ్చే పండుగల సీజన్‌తో రాబోయే త్రైమాసికాల్లో వినియోగం మరింత పెరిగి జీఎస్టీ రాబడి కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)