Breaking News

హెల్త్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తేస్తారా?

Published on Mon, 09/02/2024 - 16:07

వస్తు, సేవల పన్ను (GST) కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సమావేశంలో బీమా రంగం, ప్రభుత్వ ఖజానాపై విస్తృత ప్రభావాలను కలిగించే ఒక ముఖ్యమైన ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు ఆ ప్రధాన ప్రతిపాదన.దీని వల్ల ఏటా ప్రభుత్వ ఆదాయానికి రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.

“జీఎస్టీ నుంచి ఆరోగ్య బీమాను పూర్తిగా మినహాయిస్తే, నష్టం దాదాపు రూ. 3,500 కోట్లు. సెప్టెంబరు 9న జరిగే సమావేశంలో జీఎస్టీ నుండి ఆరోగ్య బీమా  మినహాయింపును కౌన్సిల్ ఆమోదిస్తే భారీ ఆదాయ నష్టం కలిగిస్తుంది” అని ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ‘మనీకంట్రోల్’ పేర్కొంది.

కమిటీ సిఫార్సులే కీలకం
ప్రస్తుతం అన్ని రకాల ఆరోగ్య, జీవిత బీమా పాలసీలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఈ పన్ను నుండి ఆరోగ్య బీమాను మినహాయించాలనే ప్రతిపాదన రాష్ట్ర, కేంద్ర రెవెన్యూ అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ చర్చలో ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షించి కౌన్సిల్‌కు సిఫార్సులు చేయడం కమిటీ బాధ్యత.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్‌ ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ మినహాయింపు ప్రభుత్వ రెవెన్యూపై ఎంత మేర ప్రభావాన్ని చూపుతుందన్నది ఫిట్‌మెంట్ కమిటీ విశ్లేషించి సిఫార్సులు చేస్తుంది. వీటిపైనే కౌన్సిల్ తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)