Breaking News

వినియోగం వృద్ధితో అధిక ఆదాయం

Published on Mon, 09/08/2025 - 06:11

న్యూఢిల్లీ: జీఎస్‌టీ ఇటీవలి సంస్కరణలతో వినియోగం పుంజుకుని, మెరుగైన ఆదాయానికి బాటలు వేస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యక్తం చేశారు. తద్వారా జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణతో ఏర్పడే రూ.48,000 ఆదాయ లోటు భర్తీ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధికి బలాన్నిస్తుందన్నారు. 

మొదటి త్రైమాసికంలో (జూన్‌ క్వార్టర్‌) బలమైన వృద్ధి రేటు నమోదు కావడం, చరిత్రాత్మక జీఎస్‌టీ సంస్కరణలతో.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.3–6.8 శాతం అంచనాలను అధిగమిస్తామని ప్రకటించారు.జీఎస్‌టీలో 12%, 28% జీఎస్‌టీ శ్లాబులను ఎత్తివేస్తూ.. అందులోని మెజారిటీ ఉత్పత్తులను 5, 18 శాతం శ్లాబుల్లోకి మార్చుతూ గత వారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయించడం తెలిసిందే. 

దీన్ని ప్రజా సంస్కరణగా మంత్రి సీతారామన్‌ అభివరి్ణంచారు. దీనివల్ల ప్రతి కుటుంబానికీ ప్రయోజనం దక్కుతుందన్నారు. రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ కావడాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే కార్ల తయారీదారులు, బీమా  కంపెనీలు, పాదరక్షల వంటి కొన్ని పరిశ్రమలు రేట్ల తగ్గింపును ప్రకటించడాన్ని గుర్తు చేశారు.   

‘రూపాయి’ని గమనిస్తున్నాం.. 
కరెన్సీ మారకం విలువలను ప్రభుత్వం గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్‌ తెలిపారు.  ‘డాలర్‌తో రూపాయి ఎక్కువ విలువను కోల్పోయింది. ఇతర కరెన్సీలతో కాదు’ అని స్పష్టం చేశారు. భారత్‌పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధించడం, భారత క్యాపిటల్‌ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలతో డాలర్‌తో రూపాయి విలువ 88.38 కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే.  

ప్రధాని చొరవ.. ఆర్థిక మంత్రి కసరత్తు 
‘ఒక్కసారి జీఎస్‌టీ సంగతి చూడండి’ ప్రధాని మోదీ చేసిన సూచన ఆధారంగానే ఈ భారీ కసరత్తుకు పూనుకున్నట్టు మంత్రి సీతారామన్‌ స్వయంగా వెల్లడించారు. ‘‘గత జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీకి ముందు (2024 డిసెంబర్‌లో) ప్రధాని నాకు కాల్‌ చేశారు. ‘ఒకసారి జీఎస్‌టీ విధానంపై దృష్టి పెట్టండి. రేట్ల పరంగా ఎందుకంత అయోమయం? వ్యాపారాలకు సులభతరంగా మార్చండి’ అని చెప్పారు. 

ఆ తర్వాత బడ్జెట్‌(2025–26)లో ఆదాయపన్ను ఉపశమన చర్యలపై చర్చల సమయంలోనూ.. ‘జీఎస్‌టీపై మీరు పనిచేస్తున్నారు కదా?’ అంటూ ప్రధాని మళ్లీ గుర్తు చేశారు. జీఎస్‌ టీ అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు ముగిసిన నేపథ్యంలో సమగ్ర సమీక్ష అవసరమని భావించాం.  వ్యా పారులు, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల కోణం నుంచి చూశాం’’ అని మంత్రి సీతారామన్‌ చెప్పారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)