Breaking News

నవరాత్రులకు ముందే జీఎస్టీ కొత్త రేట్లు!

Published on Mon, 08/25/2025 - 12:53

జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబుల తొలగింపునకు ప్రతిపాదించింది.  జీఎస్టీ శ్లాబుల సవరణ.. కొత్త పన్ను రేట్లు నవరాత్రి పర్వదినానికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ సెప్టెంబర్ 22 నాటికి కొత్త జీఎ‍స్టీ పన్ను శ్లాబులను అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌ పేర్కొంది.

కేంద్రం ప్రతిపాదించిన 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు వ్యవస్థల జీఎస్టీ పన్ను శ్లాబులపై చర్చించేందుకు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. రేట్ల హేతుబద్ధీకరణ, పరిహార సెస్, ఆరోగ్య, జీవిత బీమాపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ చర్చించనుంది. రాష్ట్ర మంత్రులతో కూడిన మంత్రుల బృందం (జివోఎం) ఇదివరకే సమావేశమై, రెండు శ్లాబుల జీఎస్టీపై కేంద్రం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత దాదాపు ఐదారు రోజుల తర్వాత జీఎస్టీ కొత్త రేట్ల అమలుపై నోటిఫికేషన్లు వెలువడుతాయని తెలుస్తోంది.

రెండే శ్లాబులు.. తక్కువ పన్నులు
కేంద్రం 5% (మెరిట్ వస్తువులకు), 18% (స్టాండర్డ్ వస్తువులకు) అనే రెండు శ్లాబుల జీఎస్టీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అదనంగా కొన్ని వస్తువులపై ప్రత్యేక రేట్లు అమలవుతాయి. అల్ట్రా లగ్జరీ కార్లు, సిన్ గూడ్స్‌పై 40 శాతం, కార్మికాధారిత రంగాలపై 0.1%, 0.3%, 0.5% రాయితీ రేట్లు కొనసాగుతాయి.

ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ నిర్మాణంలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబులు ఉన్నాయి. త్వరలో అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ నిర్మాణంలో 12%, 28% శ్లాబులను తొలగించనున్నారు. 5%, 18% శ్లాబుటు మాత్రమే కొనసాగుతాయి. తద్వారా అనేక వస్తువులపై పన్నులు తగ్గి వాటి ధరలు దిగిరానున్నాయి. అయితే రానున్నది పండుగ సీజన్‌ కాబట్టి ఎక్కువ కొనుగోళ్లకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పండగ సీజన్‌కు ముందే కొత్త రేట్లు అమల్లోకి వస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)