Breaking News

జులైలో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు

Published on Fri, 08/02/2024 - 11:28

భారత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జులైలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.3 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జులై 1వ తేదీన కొత్త పరోక్ష పన్ను వసూళ్ల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి మూడో అత్యధిక వసూళ్లు.

ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం..జులైలో మొత్తం రీఫండ్‌లు రూ.16,283 కోట్లుగా ఉన్నాయి. రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర వస్తు, సేవల పన్ను (జీఏస్టీ) సేకరణ రూ.1.66 లక్షల కోట్లుగా ఉంది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,82,075 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.32,386 కోట్లు, స్టేట్‌ జీఎస్టీ రూ.40,289 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.96,447 కోట్లు, సెస్ రూ.12,953 కోట్లు ఉన్నాయి. 

ఇదీ చదవండి: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు.. కారణం..

దేశీయ కార్యకలాపాల పన్నుల ద్వారా ఆదాయం 8.9 శాతం వృద్ధి చెంది జులైలో రూ.1.34 లక్షల కోట్లుకు చేరింది. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 14.2 శాతం పెరిగి రూ.48,039 కోట్లకు చేరింది. స్థూల జీఎస్టీ రాబడులు ఏప్రిల్ 2024లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్ 2023లో ఇది రూ.1.87 లక్షల కోట్లు. తాజాగా వసూలైన జీఎస్టీ రూ.1.82 లక్షల కోట్లు మూడో భారీగా వసూళ్లుగా నమోదయ్యాయి.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)