జీఎస్‌టీ ఎఫెక్ట్: ఈ బైక్ ధరలు భారీగా పెరగనున్నాయ్!

Published on Fri, 08/29/2025 - 14:41

పండుగ సీజన్‌లో వాహనాల ధరలు కొంత తగ్గుతాయి, అప్పుడు నచ్చిన బైక్ కొనుగోలు చేద్దామని కొంతమంది వేచి చూస్తుంటారు. కానీ వారి ఆశలన్నీ ఆవిరైపోయే సమయం వచ్చేసింది. ఎందుకంటే జీఎస్‌టీ పెరుగుదల కారణంగా.. బైక్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ముఖ్యంగా 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్స్.. ఆన్ రోడ్ ధరలు ఇప్పుడు 30 శాతం లేదా.. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాగా తక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు అన్ని మోటార్ సైకిల్స్ 28 శాతం జీఎస్‌టీ కింద ఉన్నాయి. అయితే 350 సీసీ బైకులకు 28 శాతం జీఎస్‌టీతో పాటు 3 శాతం సెస్సు కలుస్తుంది. అంటే వీటిపై జీఎస్‌టీ 31 శాతానికి చేరుతుంది. ఇక త్వరలో రాబోయే జీఎస్‌టీ 2.0 విధానంలో రెండు శ్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగిలినవన్నీ రద్దు అవుతాయి. అయితే 40 శాతం జీఎస్‌టీ అనేది లగ్జరీ వాహనాలకు వర్తిస్తుంది.

ఇదీ చదవండి: ఈ కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు

జీఎస్‌టీ ప్రభావం వల్ల.. బైక్ ధరలు రూ. 20,000 నుంచి రూ. 45,000 వరకు పెరుగుతాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రస్తుత ఆన్ రోడ్ ధర రూ. 3.80 లక్షలు. జీఎస్‌టీ కారణంగా దీని ధర రూ. 4.13 లక్షలకు చేరుతుంది. అదే విధంగా కేటీఎం ధర కూడా రూ. 3.60 లక్షల నుంచి రూ. 3.91 లక్షలకు చేరుతుంది. ట్రయంఫ్, బజాజ్, ఏప్రిలియా, హార్లే డేవిడ్సన్ వంటి బైకుల ధరలు కూడా పెరుగుతాయి.

#

Tags : 1

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)