Breaking News

ఉద్యోగుల్లో వేతన సంక్షోభం

Published on Sat, 07/05/2025 - 17:28

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీడీపీల్లో భారత్ ఒకటిగా నిలవడం ఆశావాదానికి అద్దం పడుతోంది. అయితే దేశంలోని కార్పొరేట్ కంపెనీల లాభాలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నప్పుడు అందులో పని చేసే ఉద్యోగుల జీవితాలు, జీతాల్లో మాత్రం మార్పు ఉండడంలేదు. కార్పొరేట్‌ లాభాలను  ఆయా యాజమాన్యాలు వ్యక్తిగతంగా ఎదగడానికి మాత్రమే ఖర్చు చేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ‘ది గ్రేట్ ఇండియన్ శాలరీ క్రైసిస్’ అని పిలుస్తున్నారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని చంకలు చరిచేలోపే.. శ్రామిక శక్తి ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు నివ్వెర పరుస్తున్నాయి.

దేశంలో ఆర్థిక పురోభివృద్ధి ఉన్నప్పటికీ సగటు కార్మికుడి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా, వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి. వారి సంపాదనకు, ఖర్చులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. ఉద్యోగుల శ్రమకు తగిన ప్రతిఫలం ఉండకపోవడంతో వారి ఆర్థిక ప్రణాళికలు అస్తవ్యస్తంగా మారి ప్రధాన నగరాల్లోని నిపుణులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

స్తబ్దుగా వేతనాలు

భారత జీడీపీ విస్తరిస్తున్నప్పటికీ జీతాల వృద్ధి మాత్రం గణనీయంగా మందగించింది. 2023 లో సగటు వేతన పెరుగుదల కేవలం 9.2% మాత్రమే ఉండడం  దీనికి నిదర్శనం. ఈ పెంపు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదు. ద్రవ్యోల్బణం రేట్లు ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు వేతనాల పెరుగుదలను మించిపోయాయి. కంపెనీలు రికార్డు లాభాలను నమోదు చేసేందుకు దోహదపడే ఉద్యోగుల వేతన పెంపుపై యాజమాన్యాలు మొండి వైఖరి అనుసరిస్తున్నాయి. సంపన్నులు, సగటు కార్మికుడి మధ్య ఆర్థిక అంతరం విస్తృతంగా పెరుగుతోంది. అధిక వేతనం పొందే రంగాల్లో కొంతమంది ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువ మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో మైక్రోసాఫ్ట్‌ కార్యాలయం మూసివేత

పట్టణాల్లో మరింత ఖర్చులు

నోయిడా, ఢిల్లీ, చెన్నై, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌.. వంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో నివసిస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జీవన వ్యయం అదుపు తప్పడంతో నగరంలోని ఉద్యోగులు అధిక అద్దెలు, ఈఎంఐలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతమవుతున్నారు. ఓ పాతికేళ్ల కిందట మోస్తారు ఖర్చులతో కాలం వెళ్లదీసుకొచ్చినవారికి ఇప్పుడు అవే ఖర్చులు ఊపిరి పీల్చుకోనివ్వకుండా చేస్తున్నాయి. 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)