Breaking News

బ్యాంకుల్లో అప్రెంటిస్‌లుగా గ్రాడ్యుయేట్లు

Published on Sat, 09/07/2024 - 07:26

ముంబై: గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతోంది. ఉద్యోగావకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌ మెహతా కీలక ప్రకటన చేశారు.

అప్రెంటిస్‌లుగా 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి బ్యాంకులు యోచిస్తున్నాయని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌ మెహతా శుక్రవారం తెలిపారు. 12 నెలల అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రత్యేక నైపుణ్యంపై శిక్షణ ఇస్తారు. వీరికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌ను బ్యాంకులు చెల్లిస్తాయని మెహతా వెల్లడించారు.

‘నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం లేని మార్కెటింగ్, రికవరీ వంటి అనేక విభాగాలు ఉన్నాయి. వారికి ఆయా విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాము. 21–25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. అభ్యర్థి పన్ను చెల్లింపుదారు కాకూడదు. అలాగే ఐఐటీ, ఐఐఎం వంటి అగ్రశ్రేణి సంస్థల నుంచి డిగ్రీని కలిగి ఉండకూడదు.

బ్యాంకింగ్‌ సేవలను చివరి మైలు వరకు తీసుకువెళ్లే అప్రెంటిస్‌లను బిజినెస్‌ కరస్పాండెంట్లుగా కూడా నియమించుకోవచ్చు. శిక్షణ పూర్తి అయ్యాక వారిలో కొందరు ఉద్యోగులుగా చేరే అవకాశమూ ఉంది. అన్ని బ్యాంకులు నెలరోజుల్లోగా అప్రెంటిస్‌లను నియమించుకోనున్నాయి. ఈ స్కీమ్‌ అమలుకు ప్రభుత్వ మద్దతు కూడా ఉంది’ అని చెప్పారు. అయితే ఎంత మందిని అప్రెంటిస్‌లుగా చేర్చుకుంటారనేది వెల్లడి కాలేదు. ఐబీఏ ఈ స్కీమ్‌పై కార్పొరేట్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ సెక్రటరీతో గురువారం చర్చించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)