Breaking News

‘భారత్‌ను బెదిరిస్తారు’.. సూపర్‌ పవర్‌గా ఎదగాలంటే..

Published on Fri, 08/08/2025 - 12:07

భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఇటీవల సంతకం చేసిన నేపథ్యంలో పలువులు పారిశ్రామికవేత్తలు స్పందిస్తున్నారు. జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయల్ సుంకాల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం తన భవితవ్యంపై నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ శక్తులు ఇండియాను బెదిరిస్తూనే ఉంటాయన్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి శక్తిగా ఎదిగేందుకు భారత్ కృషి చేయాలని కోరారు. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడంపై భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో జీడీపీ, ఎగుమతులపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అందరూ ఏకం కావాలని పిలుపు

భారత్ సూపర్ పవర్‌గా ఎదగాలని దీపిందర్ గోయల్ తన లింక్డ్‌ఇన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఇండియా బలాన్ని పెంపొందించుకోకపోతే, ప్రపంచ శక్తులు బెదిరింపులకు పాల్పడుతాయని హెచ్చరించారు. దేశంలోని పౌరులు, వ్యాపారులు, విధాన నిర్ణేతలు భారత్‌ను ప్రపంచ స్థాయిలో టాప్‌లో ఉంచేందుకు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: భారత్‌కు ఎంత బాధైనా అది ఏడాదే?

ట్రంప్ ఇటీవలి కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో భారత దిగుమతులపై అదనంగా 25% సుంకాన్ని విధిస్తున్నట్లు చెప్పారు. దాంతో మొత్తం లెవీ 50 శాతానికి చేరింది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)