Breaking News

టమాటా ధరలు తగ్గింపుపై కేంద్ర కీలక ప్రకటన! మరింత..

Published on Sat, 08/19/2023 - 15:40

గత కొన్ని రోజులకు ముందు టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కేజీ రూ. 100 కంటే ఎక్కువ వద్ద లభిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం టమాటాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) 2023 ఆగస్టు 20 నుండి కిలో రూ. 40 రిటైల్ ధరకు టమోటాలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

ధరల పెరుగుదల సమయంలో కూడా కేంద్రం తక్కువ ధరలకే ప్రజలకు టమాటాలు అందించిన సందర్భాలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఆగస్ట్ 15న ప్రభుత్వం టమాటా ధరలను రూ.50కి తగ్గించింది, తాజాగా ఈ ధరలను మరింత తగ్గిస్తూ ప్రకటించింది.

ఇదీ చదవండి: ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే?

ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏకంగా 15 లక్షల కేజీల టమాటాలు విక్రయించినట్లు తెలుస్తోంది. విక్రయాలు ఢిల్లీలో మాత్రమే కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వారణాసి, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కూడా జరిగినట్లు సమాచారం. కేవలం గత 15 రోజుల్లో ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకంగా 560 టన్నుల టమోటాలను విక్రయించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)