Breaking News

సీలింగ్‌ ఫ్యాన్లకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే భారీ జరిమానాలు

Published on Sun, 08/20/2023 - 17:31

Quality Norms For Ceiling Fans: నాసిరకం వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు, దేశీయంగా విద్యుత్ ఫ్యాన్ల తయారీని పెంచేందుకు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్‌లకు ప్రభుత్వం తప్పనిసరి నాణ్యతా నిబంధనలను జారీ చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్- 2023 కిందకు వచ్చే వస్తువులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తును కలిగి ఉంటే తప్ప వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం కుదరదు.

ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్‌లకు ఇప్పటి వరకు ఎలాంటి బిస్‌ ధ్రువీకరణ నియమాలు లేవు. బిస్‌ చట్టం నిబంధనను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. మరోసారి ఉల్లంఘనలకు పాల్పడితే కనీస జరిమానా రూ. 5 లక్షలకు పెరుగుతుంది. ఇది ఆయా వస్తువుల విలువ కంటే 10 రెట్లు వరకు ఉండవచ్చు.

ఎంఎస్‌ఎంఈలకు సడలింపులు
క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) అమలుకు సంబంధించి ఎలక్ట్రిక్‌ సీలింగ్‌ ఫ్యాన్లను తయారు చేసే దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు డీపీఐఐటీ సడలింపులు ఇచ్చింది. ఎంఎస్‌ఎంఈలకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)