Breaking News

వెండి దిగుమతులపై ఆంక్షలు.. వచ్చే మార్చి వరకు..

Published on Thu, 09/25/2025 - 16:07

బయటి దేశాల నుంచి వచ్చే వెండి దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రత్నాలు లేని సాధారణ వెండి ఆభరణాల (Silver jewellery) దిగుమతులను పరిమితం చేసింది. ఆంక్షలు తక్షణం అమల్లోకి వచ్చి 2026 మార్చి చివరి వరకు కొనసాగుతాయి.

వెండి దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. "స్వేచ్ఛా విధానం నుంచి పరిమిత విధానానికి దిగుమతి విధానాన్ని తక్షణమే మార్పు చేశాం. మార్పు మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటుంది" అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని ప్రకారం.. దీనిపై ఇకపై వెండి ఆభరణాలు దిగుమతి (Imports) చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్స్తీసుకోవాల్సి ఉంటుంది.

ఆంక్షలకు కారణాలు ఇవే..

2024-25 ఏప్రిల్-జూన్ నుండి 2025-26 ఏప్రిల్-జూన్ వరకు ప్రిఫరెన్షియల్ డ్యూటీ మినహాయింపుల కింద వెండి ఆభరణాల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇలా దిగుమతి చేసుకున్న వెండి వస్తువులను పూర్తయిన ఆభరణాలుగా చూపించి దిగుమతి సుంకాలను ఎగ్గొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం భారతదేశ ఆభరణాల తయారీదారులకు సమాన అవకాశాలను అందిస్తుందని, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ప్రయోజనాలను పరిరక్షించగలదని, ఈ రంగంలోని కార్మికులకు జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు: మరింత గుడ్‌న్యూస్‌!

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు