Breaking News

ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌ల దిగుమతులు: సంచలన నిర్ణయం

Published on Thu, 08/03/2023 - 12:53

Restrictions on Imports కేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కంప్యూటర్‌ల దిగుమతిపై తక్షణమే ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి  నేడు (ఆగస్ట్ 3 న) వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది.  పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో దిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై పరిమితులు వర్తించవు

ఈ దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే అమలయ్యేలా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్‌లు ,అల్ట్రా స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్‌లు, సర్వర్‌ల దిగుమతులపై హెచ్‌ఎస్‌ఎన్ 8741 కింద ఈ  పరిమితులు విధిస్తున్నట్టు  వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి)

బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాగేజీ నియమాలు భారత సరిహద్దులోకి ప్రవేశించే లేదా బయటికి వచ్చే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ నిబంధనలు పాటించాలి. అలాగే పోస్ట్ లేదా కొరియర్. దిగుమతులు వర్తించే విధంగా సుంకం చెల్లింపునకు లోబడి ఉంటాయి. అలాగే విదేశాల్లో రిపేర్ అయిన వస్తువులను తిరిగి దిగుమతి చేసుకునేందుకు సంబంధించి, వాటి రిపేర్‌కి ఇవ్వడానికి, తిరిగి తీసుకోవడానికి  సంబంధించిన దిగుమతులకు లైసెన్స్ అవసరం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. (టమాటా షాక్‌: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!)

సెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్ ఇతర సమయాల్లో దిగుమతిదారులు దిగుమతి లైసెన్స్ అవసరం లేకుండా సరుకుకు 20 వస్తువులను తీసుకురావచ్చు. అయితే, ఈ ఐటెమ్‌లు తప్పనిసరిగా నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగింలాలి. తిరిగి విక్రయించడానికి లేదు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరిన తర్వాత, ఉత్పత్తులను నాశనం చేయాలి లేదా తిరిగి ఎగుమతి చేయాలి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)