Breaking News

జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?

Published on Thu, 07/25/2024 - 12:40

జీఎస్టీ శ్లాబులను మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు సాగుతున్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ శ్లాబుల విధానంలో చాలా వస్తువుల వర్గీకరణపై వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు జరుగుతున్నాయి. జులై 2017లో జీఎస్టీను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆదాయ వృద్ధి మెరుగుపడింది’ అన్నారు.

ఇదీ చదవండి: ఈఎస్‌ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులు

కేంద్ర బడ్జెట్‌ 2024-25 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ ప్రయోజనాలను పెంచడం కోసం పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ పరిధిని ఇతర రంగాలకు విస్తరిస్తాం’ అని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2024లో ఆల్‌ టైమ్‌హై రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)