Breaking News

టెలికం సంస్థలకు సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలు

Published on Sun, 11/24/2024 - 08:24

న్యూఢిల్లీ: దేశ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లు, సర్వీసులకు భద్రత కల్పించే దిశగా టెలికం సైబర్‌ సెక్యూరిటీ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. సైబర్‌ సెక్యూరిటీకి భంగం కలగకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు, ఒకవేళ ఉల్లంఘన ఉదంతాలేమైనా తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు మొదలైనవి వీటిలో ఉన్నాయి.

వీటి ప్రకారం ప్రతి టెలికం సంస్థ సైబర్‌ సెక్యూరిటీ పాలసీని (భద్రత చర్యలు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు, శిక్షణ, ఉత్తమ విధానాలు.. టెక్నాలజీలను వినియోగించడం మొదలైనవి) అమలు చేయాల్సి ఉంటుంది. చీఫ్‌ టెలికమ్యూనికేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ని నియమించుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఉల్లంఘన జరిగితే ఆరు గంటల్లోగా ప్రభావిత సిస్టం వివరాలను కేంద్రానికి తెలియజేయాలి. 24 గంటల వ్యవధిలో ఏ ప్రాంతంలో, ఎంత మంది యూజర్లపై, ఎంత సేపు ప్రభావం పడింది, తీసుకున్న దిద్దుబాటు చర్యలేమిటి తదితర వివరాలను ఇవ్వాలి.

అలాగే, మొబైల్‌ పరికరాల తయారీ సంస్థలు ఆయా ఉత్పత్తులను విక్రయించడానికి ముందే, వాటి ఐఎంఈఐ నంబరును ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సైబర్‌ సెక్యూరిటీని మెరుగుపర్చే దిశగా టెలికం సంస్థల నుంచి ట్రాఫిక్‌ డేటా, ఇతరత్రా వివరాలను తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)