Breaking News

అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక

Published on Fri, 03/20/2026 - 08:38

విమాన ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. పారదర్శకతను పెంచడం, ప్రయాణీకుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఖర్చు లేకుండా సీట్ల కేటాయింపు

ప్రస్తుతం చాలా విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ లేదా టికెట్ బుకింగ్  సమయంలో ‘ప్రిఫర్డ్ సీట్’ పేరుతో ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు టికెట్ ధర కంటే ఈ ఫీజుకే ఎక్కువే చెల్లించాల్సి వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి విమానంలో 60 శాతం సీట్లు కచ్చితంగా ఉచిత ఎంపిక కేటగిరీలో ఉండాలి. ఒకే పీఎన్‌ఆర్‌పై టికెట్ బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కలిసి కూర్చునేలా విమానయాన సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పక్కపక్క సీట్ల కోసం అదనంగా చెల్లించే అవసరం తప్పుతుంది.

బ్యాగేజీపై డీజీసీఏ సూచించిన స్పష్టమైన విధానాలు

  • స్పోర్ట్స్ కిట్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్లు తీసుకెళ్లడంపై స్పష్టమైన, సులభతరమైన నిబంధనలు ఉండాలి.

  • విమానాల్లో పెంపుడు జంతువుల రవాణాపై ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ విమానయాన సంస్థలు తమ వెబ్‌సైట్లలో కచ్చితమైన పాలసీని ప్రదర్శించాలి.

  • ప్రయాణికుల హక్కులు, విమాన ఆలస్యం లేదా రద్దు సమయంలో లభించే పరిహారం గురించి వెబ్‌సైట్లు, ఎయిర్‌పోర్ట్ కౌంటర్లలో తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.

భారత విమానయాన రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఎదుగుతోంది. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న తరుణంలో ప్రయాణికుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!

Videos

కాంగ్రెస్ సర్కార్ రోజుకో స్కాం అసెంబ్లీలో మొత్తం బయటపెడతా

మాతో పెట్టుకోవద్దు.. పాక్‌కు ఆఫ్ఘన్ ప్లేయర్ వార్నింగ్

అసెంబ్లీలో బడ్జెట్ పై భట్టి స్పీచ్

బడ్జెట్ అంతా డొల్లే కాంగ్రెస్ పై BRS ఎమ్మెల్యేల ఫైర్

చీకు చింత లేని సంసారంలో చిచ్చు.. CI బయటపెట్టిన సంచలన విషయాలు

తినేది పెరుగన్నం నిమ్మకాయ బద్ద ఆస్తులు మాత్రం 20 లక్షల కోట్లు.. శ్రవణ్ షాకింగ్ నిజాలు

Telangana Budget: రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ఏ శాఖకు ఎంతంటే..!

అడ్డుకున్న పోలీసులు ఇచ్చిపడేసిన కాకాణి

వాహనదారులకు షాక్! FASTag వార్షిక పాస్ట్ ధర పెంపు కొత్త రేట్లు ఇవే

అమెరికా ఫైటర్ జెట్ ధ్వంసం.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్

Photos

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)

+5

శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)