Breaking News

త్వరలో ప్రభుత్వ క్రెడిట్‌ కార్డులు..

Published on Thu, 02/20/2025 - 18:18

కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్‌ కార్డులను (Credit Cards) సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులు త్వరలో అందుకోనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2025-26) హామీ ఇచ్చినట్లుగా మైక్రో ఎంట్రాప్రెన్యూర్‌లకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది.

ఈ సౌకర్యం రాబోయే కొన్నేళ్లలో సూక్ష్మ-యూనిట్‌లకు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందించగలదు. ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

క్రెడిట్ కార్డు లిమిట్‌, షరతులు
రూ. 5 లక్షల లిమిట్‌ కలిగిన ఈ క్రెడిట్ కార్డ్.. చిరు దుకాణాలను, చిన్న తరహా తయారీ పరిశ్రమలను నిర్వహించేవారికి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ
ప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి, దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్‌ (Udyam) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్‌లో నమోదుకు ఈ దశలు పాటించండి..

» అధికారిక ఉద్యమ్‌ పోర్టల్ msme.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. 
» 'క్విక్ లింక్స్' పై క్లిక్ చేయండి.
» 'ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.
» రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి.

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)