Breaking News

గూగుల్ క్రోమ్ యూజర్లూ తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హై రిస్క్‌ వార్నింగ్‌

Published on Sat, 09/30/2023 - 19:17

Google Chrome Users High Risk Warning గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లూ బీ అలర్ట్‌. గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం  చోరీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. అప్‌డేట్‌ చేసుకోకపోతే సెక్యూరిటీ పరమైన సమస్యలు తప్పవంటూ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది.  భారతదేశంలో  కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా గుర్తించిన లోపాలను హై-రిస్క్‌గా వర్గీకరించింది.

ముఖ్యంగా WebPలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, కస్టమ్ ట్యాబ్‌లు, ప్రాంప్ట్‌లు, ఇన్‌పుట్, ఇంటెంట్‌లు, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇంటర్‌స్టీషియల్స్ లోపాలను గుర్తించినట్టు తెలిపింది. అలాగే డౌన్‌లోడ్‌లు, ఆటోఫిల్‌లో వాటిల్లో పాలసీ  సరిగ్గా అమలు కాలేదని తెలిపింది.  గూగుల్ క్రోమ్ ఈ లోపాలను బాధితుడి సిస్టమ్‌కు అనధికారిక యాక్సెస్‌ని అందించేలా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఉంటుందని CERT-In  వెల్లడించింది.  ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ వినియోగదారులు తమ సిస్టమ్‌ ప్రొటెక్షన్‌ కోసం అప్‌డేట్‌  చేసుకోవడంఉత్తతమని సూచించింది.  


Google Chromeఅప్‌డేట్‌ చేసుకోవడం ఎలా? 
 Chrome విండోను  ఓపెన్‌  చేసి కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి.
డ్రాప్‌డౌన్ మెను నుండి,  హెల్ప్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. 
" About Google Chrome"పై క్లిక్ చేయండి.
అప్‌డేట్‌పై క్లిక్‌ చేసి,  బ్రౌజర్‌ని  రీస్టార్ట్‌ చేస్తే చాలు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)