Breaking News

కేంద్రం కీలక నిర్ణయం!..రేషన్‌ కార్డు దారులకు గుడ్‌న్యూస్!

Published on Tue, 03/28/2023 - 15:58

రేషన్‌ కార్డ్‌ హోల్డర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేషన్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ చేసే గడువును మార్చి 31 నుంచి జూన్‌ 30,2023కి పొడిగించింది. ఈ పొడిగింపుపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ విభాగానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (డీఎఫ్‌పీడీ) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యవసర వస్తువుల్ని రేషన్ కార్డు ద్వారా సబ్సీడీగా పొందవచ్చు. దీంతో పాటు పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డ్‌ ఎలా గుర్తింపు కార్డ్‌గా వినియోగించుకుంటామో.. ఈ రేషన్‌ కార్డ్‌ను అలాగే ఉపయోగించుకునేందుకు వీలుంది. 

అయితే దేశంలో నిజమైన రేషన్‌ కార్డ్‌ లబ్ధి దారుల్ని గుర్తించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌ కార్డ్‌కు ఆధార్‌ కార్డ్‌ను జత చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఒకటి కంటే ఎక్కువ రేషన్‌ కార్డ్‌లు ఉంటే వాటిని రద్దు చేయడం, ఎక్కువ ఆదాయం అర్జిస్తూ రేషన్‌ కార్డు వినియోగిస్తుంటే ఆ రేషన్‌ కార్డ్‌లను క్యాన్సిల్‌ చేయనుంది. నిజమైన లబ్ధిదారులకు నిత్యవసర వస్తువుల్ని అందించనుంది. 

రేషన్‌ కార్డ్‌కు ఆధార్‌ లింక్‌ ఇలా చేయండి

♦ ముందుగా పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌(పీడీఎస్‌)వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

♦ అందులో ఆధార్‌ కార్డ్‌ నెంబర్‌,రేషన్‌ కార్డ్‌ నెంబర్‌ తో పాటు ఫోన్‌ నెంబర్‌ వంటి వివరాల్ని నమోదు చేయాలి. 

♦ అనంతరం కంటిన్యూ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి

♦ కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్‌ చేసిన వెంటనే మీ రిజిస్ట్రర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది

♦ ఓటీపీ ఎంటర్‌ చేస్తే రేషన్‌ కార్డ్‌కు ఆధార్‌ లింక్‌ అవుతుంది

 ఆఫ్‌లైన్‌లో రేషన్‌ కార్డ్‌ - ఆధార్‌ లింక్‌ ఇలా చేయండి

♦ కుటుంబసభ్యుల ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ కాపీలు, రేషన్‌ కార్డ్‌ జిరాక్స్‌లు, బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ కార్డ్‌ లింక్‌ చేయకపోతే బ్యాంక్‌ పాస్‌ బుక్‌ జిరాక్స్‌ కాపీలు, కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలతో రేషన్‌ కార్యాలయానికి వెళ్లాలి

♦ అక్కడ ఆధార్‌ కార్డ్‌ డేటా బేస్‌లో మీ వివరాలని గుర్తించేలా ఫింగర్‌ ప్రింట్స్‌ ఇవ్వాలి

♦ ఆధార్‌ డేటా బేస్‌లో ఉన్న మీ వివరాలు మ్యాచ్‌ అయితే ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. 

♦ అనంతరం రేషన్‌ కార్డ్‌కు ఆధార్‌ కార్డ్‌ను జత చేస్తారు. 

చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్‌, ఆధార్‌ కార్డ్‌ ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌!

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)