పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు...  రూ.21,534 కోట్లు

Published on Thu, 06/26/2025 - 06:27

న్యూఢిల్లీ: భారత్‌లో తయారీని ప్రోత్సాహించేందుకు కేంద్రం తలపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 రంగాలకు రూ.21,534 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో సరఫరా వ్యవస్థ నుంచి సమస్యలు ఏర్పడడంతో.. భారత్‌లో తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోదీ సర్కారు 2021లో పీఎల్‌ఐ పథకాన్ని 14 రంగాల కోసం ప్రకటించింది. రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. 

ఇప్పటి వరకు 12 రంగాలకు కలిపి రూ.21,534 కోట్ల ప్రోత్సాహకం విడుదల చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఎల్రక్టానిక్స్‌ తయారీ, ఐటీ హార్డ్‌వేర్, బల్క్‌ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఆహార ప్రాసెసింగ్, వైట్‌ గూడ్స్‌ (ఏసీలు తదితర), ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, టెక్స్‌టైల్స్, డ్రోన్స్‌ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. ఈ తరహా పథకాల పనితీరును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తాజాగా సమీక్షించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి పెట్టుబడులు, ప్రోత్సాహకాలతో తమ పరిధిలో కార్యాచరణ రూపొందించాలని వివిధ శాఖలను కోరారు.  

12 లక్షల మందికి ఉపాధి 
పీఎల్‌ఐ పథకం కింద ఇప్పటి వరకు రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. వీటి ద్వారా రూ.16.5 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా నమోదు కాగా, 12 లక్షల మందికి పైగా ఈ ఏడాది మార్చి నాటికి ఉపాధి (ప్రత్యక్ష, పరోక్ష) లభించినట్టు పేర్కొంది. ఫార్మా రంగానికి సంబంధించి పీఎల్‌ఐ పురోగతిని సమీక్షించగా, ఈ రంగంలో రూ.2.66 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా సాధ్యమైనట్టు, ఇందులో రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు మొదటి మూడేళ్లలో నమోదైనట్టు వాణిజ్య శాఖ గుర్తించింది. 

మొత్తం మీద ఫార్మా రంగంలో దేశీయంగా విలువ జోడింపు 2025 మార్చి నాటికి 83.70 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. బల్క్‌ డ్రగ్‌ విభాగంలో మన దేశం నికర దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారింది. 2021–22 నాటికి నికర బల్‌్కడ్రగ్‌ దిగుమతులు రూ.1,930 కోట్లుగా ఉంటే, 2025 మార్చి నాటికి రూ.2,280 కోట్ల నికర ఎగుమతులు పీఎల్‌ఐ కింద నమోదయ్యాయి. మ్యాన్‌ మేడ్‌ ఫైబర్‌ (ఎంఎంఎఫ్‌) టెక్స్‌టైల్స్‌ ఎగుమతులు 6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు 5.7 బిలియన్‌ డాలర్లుగానే ఉండడం గమనార్హం.  

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)