15 రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గింపు

Published on Tue, 06/03/2025 - 12:21

ముడి వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండు వారాల్లో రిటైల్ స్థాయిలో వంట నూనెల ధరలు 5-6 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో దాదాపు 17 శాతం పెరిగిన వంట నూనె ధరలు ఎట్టకేలకు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఇది సింగిల్ డిజిట్‌కు చేరుకుంటుందని భావిస్తున్నట్లు ఇమామి అగ్రోటెక్ డైరెక్టర్, సీఈవో సుధాకర్ రావు దేశాయ్ తెలిపారు.

తగ్గిన సుంకాల వల్ల కలిగే ప్రయోజనం మరో 15 రోజుల్లో రిటైల్ ధరల్లో ప్రతిఫలిస్తుందని భావిస్తున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్లు ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టే సంకేతాలను చూపిస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. ధరల దిద్దుబాటు కేవలం దిగుమతి చేసుకునే నూనెలకే పరిమితం కాదని దేశాయ్‌ తెలిపారు. దిగుమతులపై ఆధారపడని ఆవనూనె కూడా వంటనూనెలపై కూడా 3-4 శాతం తగ్గుదలను చూడవచ్చని అన్నారు.

ఇదీ చదవండి: 300 మందికి జాబ్‌కట్‌ చేసిన ‍మైక్రోసాఫ్ట్‌

ముడి వంట నూనె, రిఫైన్డ్ ఆయిల్ సుంకాల మధ్య వ్యత్యాసం 12.5 శాతం నుంచి 22.5 శాతానికి పెరగడం వల్ల కంపెనీలు ముడినూనెను దిగుమతి చేసుకుని దేశీయంగా శుద్ధి చేయడం చాలా ఖర్చుతో కూడుకుంది. అయితే తాజాగా 10 శాతం సుంకం తగ్గింపు నిర్ణయం ఈ విభాగంలోని వ్యాపారాలకు బూస్ట్‌గా నిలుస్తుందని హల్దర్ వెంచర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేశవ్ కుమార్ హల్దర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్ వంటి దిగుమతి చేసుకున్న వంట నూనెల దేశీయ రిటైల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే రైస్ బ్రాన్, ఆవనూనె వంటి నూనెలకు కూడా ఈ తగ్గుదల వర్తించే అవకాశం ఉంది అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.
 

Videos

YSRCP కాదు.. పక్కా జనసేన.. వాడికి పవన్ అంటే పిచ్చి.. అజయ్ దేవ్ చెల్లి షాకింగ్ నిజాలు

ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో

హిప్పో జర తప్పుకో, ఈ సెక్యూరిటీ ధైర్యానికి సలాం!

ఆంధ్రా కిమ్ నారా లోకేష్

పవన్ పీకింది చాలు! డిప్యూటీ సీఎంవా.. ఆకు రౌడీవా!

మార్కెట్లోకి Ai వాషింగ్ మిషన్లు

ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు

పొట్టు పొట్టు కొట్టుకున్న ఇప్పటం జనసేన నేతలు

శభాష్ ఇస్రో.. YS జగన్ ప్రశంసలు

శ్రీలంకతో జరిగిన రెండో T-20లో భారత్ విజయం..

Photos

+5

వారణాసి ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో ఫుల్ గ్లామరస్‌గా అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు (ఫొటోలు)

+5

#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)

+5

మహేష్‌ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్‌

+5

అదరగొట్టిన విల్లా మేరీ కాలేజ్ విద్యార్థినులు (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్‌ కమెడియన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైఎస్ జగన్‌ ప్రజాదర్బార్‌: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)

+5

నా సూపర్‌స్టార్‌: భార్యకు సంజూ శాంసన్‌ విషెస్‌ (ఫొటోలు)