Breaking News

టెలికాం ఆపరేటర్లకు ఊరట.. ఎస్‌యూసీ ఛార్జీలు మినహాయిపు..?

Published on Sat, 03/08/2025 - 11:33

దేశీయ టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలను (SUC) మాఫీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్‌ సెక్రటరీ టీవీ సోమనాథన్‌ మార్చి 10న భారత టెలికాం విభాగం(DoT), ఫైనాన్స్‌ మినిస్ట్రీ అధికారులతో చర్చించబోతున్నట్లు తెలిసింది. దేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కీలకంగా ఉన్న భారత టెలికాం రంగం చాలా కాలంగా ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోనుండడం గమనార్హం.

ఎస్‌యూసీ అంటే ఏమిటి?

స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్‌యూసీ)..రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడానికి టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే రుసుము. ఆపరేటర్ల సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)లో ఈ ఛార్జీలను కొంత శాతంగా లెక్కిస్తారు. కొన్నేళ్లుగా ఎస్‌యూసీ టెలికాం కంపెనీలకు ఆర్థిక బాధ్యతగా ఉంటోంది. ఇది వాటి లాభదాయకతను, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మాఫీ చేస్తే వీటి లాభాలు పెరుగుతాయనే వాదనలున్నాయి.

రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం

2022 వేలానికి ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు ఈ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే టెలికాం ఆపరేటర్లకు సుమారు రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం లభించనుంది. 2022 వేలం తర్వాత కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇప్పటికే ఎస్‌యూసీను తొలగించింది. దాంతో గతంలో కేటాయించిన దానిపై ఈ మినహాయింపు కీలకంగా మారనుంది.

టెలికాం రంగంపై ప్రభావం ఇలా..

ఈ మాఫీ టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్థిక భారాలు తగ్గడంతో టెలికాం కంపెనీలు తమ నెట్‌వర్క్‌లను విస్తరించడం, కనెక్టివిటీని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించవచ్చు. ఈ రంగంలో ఆరోగ్యకరమైన పోటీని, సృజనాత్మకతను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.

లబ్ధిదారులు ఎవరంటే..

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఈ మాఫీ వల్ల గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు రూ.1,100 కోట్లు చొప్పున ఆదా అవుతుందని అంచనా. వొడాఫోన్ ఐడియాకు సుమారు రూ.2,000 కోట్ల ఉపశమనం లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: వేతన పెరుగుదలలో టీచింగ్‌ లీడర్లదే హవా!

సవాళ్లు ఇవే..

ఎస్‌యూసీ మాఫీ సానుకూల చర్య అయినప్పటికీ ఈ రంగం ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. ఉదాహరణకు.. పరిశ్రమ ఏజీఆర్‌ బకాయిలు, అధిక లైసెన్స్ ఫీజులు, 5జీ టెక్నాలజీలో గణనీయమైన మూలధన పెట్టుబడి వంటి చాలా సమస్యలు టెలికాం విభాగాన్ని సవాలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)