Breaking News

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం

Published on Fri, 08/08/2025 - 16:07

కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025ను వెనక్కి తీసుకుంది. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025ను తాజాగా ఉపసంహరించుకుంది.

బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సులను చేర్చి నూతన ఆదాయపు పన్ను బిల్లు సరికొత్త వెర్షన్ ఆగస్టు 11న అంటే సోమవారం తిరిగి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులో కొత్త మార్పులు చేస్తన్న క్రమంలో బహుళ వెర్షన్ల గందరగోళాన్ని నివారించడానికి అన్ని మార్పులతో స్పష్టమైన, నవీకరించిన ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టనున్నారు.

ఆదాయపు పన్ను బిల్లు 2025 మార్పులు
గత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు- 2025 అరవై సంవత్సరాల నాటి భారతదేశ ప్రత్యక్ష పన్ను చట్టంలో పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. 298-సెక్షన్ ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ప్రస్తుత శాసనం కంటే 50 శాతం తక్కువ సరళమైన భాషలో రాసిన ఆధునిక, పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక చట్టాన్ని తీసుకురావడం ఆదాయపు పన్ను బిల్లు- 2025 ముఖ్యమైన లక్ష్యం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)