బిగ్ షాక్.. బాబు సర్కార్ కు హైకోర్టు నోటీసులు..
Breaking News
భారత్ కంటెయినర్ షిప్పింగ్ లైన్ ఏర్పాటుకు వీలుగా ఒప్పందం
Published on Thu, 02/05/2026 - 06:29
ముంబై: అంతర్జాతీయంగా షిప్పింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో.. దేశంలో సమగ్ర కంటెయినర్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. భారత్ కంటెయినర్ షిప్పింగ్ లైన్ (బీసీఎస్‌ఎల్) ఏర్పాటుకు వీలు కలి్పంచే ఒప్పందంపై సంతకం చేసినట్టు ప్రకటించింది. ఈ పథకం స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీపడే కంటెయినర్ తయారీ వ్యవస్థను దేశీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం గమనార్హం. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (జేఎన్‌పీఏ), వీవో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ, చెన్నై పోర్ట్ అథారిటీ, సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.
Tags : 1