ఈక్విటీలపై ఎల్‌టీసీజీ రద్దు చేయాలి

Published on Fri, 10/30/2026 - 03:41

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఈక్విటీలపై పన్నుల రేట్లను క్రమబదీ్ధకరించాలని కేంద్రానికి పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత స్వరూపంలోని లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని, ఎస్‌టీసీజీ, ఎస్‌టీటీ రేట్లలో మార్పులు చేయాలని కోరింది. లాంగ్‌ టర్మ్‌ హోల్డింగ్‌ వ్యవధిని 12 నెలల నుంచి 18–24 నెలలకు పెంచే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. 

అలాగే, సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ని తగ్గించాలని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి రాసిన లేఖలో పీహెచ్‌డీసీసీఐ కోరింది. ఎస్‌టీటీ, క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వల్ల ఈక్విటీ పెట్టుబడులపై రెండు సార్లు పన్ను విధించినట్లవుతుంది కాబట్టి వీటిని క్రమబదీ్ధకరించాల్సిన అవసరం ఉందని వివరించింది. దీని వల్ల నిఖార్సయిన ఇన్వెస్టర్లకు తగిన మినహాయింపులు లభించినట్లవుతుందని పేర్కొంది. 

మరోవైపు, షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎస్‌టీసీజీ)పై ట్యాక్స్‌ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని లేదా ఎస్‌టీటీ రేట్లను తగ్గించాలని కోరింది. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌ మధ్య కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ. 3.08 లక్షల కోట్ల పెట్టుబడులను భారత ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. గతేడాది మొత్తం మీద ఉపసంహరించుకున్న రూ. 1.66 లక్షల కోట్లకు ఇది రెట్టింపు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ట్యాక్స్‌ రేట్లను క్రమబదీ్ధకరిస్తే పెట్టుబడులకు భారత్‌ మరింత ఆకర్షణీయంగా మారగలదని పీహెచ్‌డీసీసీఐ తెలిపింది.  

దండిగా ఎస్‌టీటీ వసూళ్లు... 
ప్రస్తుతం లిస్టెడ్‌ ఈక్విటీలు, ఈక్విటీ ఎంఎఫ్‌లపై విక్రయించగా రూ. 1.25 లక్షలు పైగా రాబడి వస్తే ఎల్‌టీసీజీకి సంబంధించి 12.5 శాతం పన్ను, సర్‌చార్జీ, సెస్సులు విధిస్తున్నారు. వీటికి ఎల్‌టీసీజీ వర్తించాలంటే హోల్డింగ్‌ వ్యవధి 12 నెలలు పైబడి ఉండాలి. ఒకవేళ 12 నెలల లోపు విక్రయిస్తే 20 శాతం స్థాయిలో షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎస్‌టీసీజీ) వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఎస్‌టీటీ కింద రూ. 57,522 కోట్లు సమీకరించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 73,700 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 14 మధ్య ఎస్‌టీటీ వసూళ్లు 52 శాతం ఎగిసి రూ. 46,840 కోట్లకు చేరింది.  

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)