Breaking News

సైబర్ మోసాల చెక్!.. బాధితులకు త్వరిత రీఫండ్స్

Published on Fri, 01/16/2026 - 19:39

ఆన్‌లైన్ ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు.. కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) పరిధిలోని.. సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) కోసం రూపొందించిన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' (SOP)కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ (MHA) ఆమోదం తెలిపింది.

కొత్త ఎస్‌ఓపీ ప్రకారం.. రూ. 50వేలు కంటే తక్కువ సైబర్ మోసాల బాధితులు కోర్టు ఆదేశం లేకుండానే రీఫండ్ పొందవచ్చు. అయితే కోర్టు ఆదేశాలు లేని సందర్భాల్లో, బ్యాంకులు గరిష్టంగా 90 రోజుల్లోగా ఫ్రీజ్ చేసిన మొత్తాలపై హోల్డ్‌ను ఎత్తివేయాల్సి ఉంటుంది. దీని వల్ల బాధితులు ఎదుర్కొంటున్న ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఈ-కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాల ఫిర్యాదులు కూడా అధికమయ్యాయి.

కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గణాంకాల ప్రకారం.. గత ఆరు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మోసం, మభ్యపెట్టడం వంటి కేసుల ద్వారా రూ. 52,976 కోట్లకు పైగా నష్టం సంభవించింది. ఈ కొత్త విధానం ఈ రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్ద ఊరటగా నిలవనుంది. ఈ నిర్ణయాన్ని ఫిన్‌టెక్ & డిజిటల్ ఫైనాన్స్ రంగ నిపుణులు స్వాగతించారు.

ఇదీ చదవండి: సిద్ధమవ్వండి.. అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)