ఆభరణాల ఎగుమతులకు కొత్త ప్రమాణాలు

Published on Sun, 11/03/2024 - 05:18

న్యూఢిల్లీ: బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల ఎగుమతులకు సంబంధించి సవరించిన వేస్టేజీ (తరుగు/వృధా) నిబంధనలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆభరణాల తయారీ సమయంలో కొంత లోహం వృధా అవుతుందని తెలిసిందే. ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ఈ వేస్టేజీ పరంగా పరిమితులు ఉన్నాయి. ఈ వేస్టేజీని తగ్గిస్తూ ఈ ఏడాది మే 27న కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. 

వీటిపట్ల పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేయడంతో 2024 డిసెంబర్‌ చివరి వరకు అమలును వాయిదా వేసింది. కొంత వెసులుబాటుతో సవరించిన నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ‘‘ఎగుమతి చేసే ఆభరణాలకు సంబంధించి ప్రామాణిక ఇన్‌పుట్‌–అవుట్‌పుట్, అనుమతించిన వేస్టేజీ నిబంధనలను సవరించడమైనది’’అంటూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ ప్రకటించింది.

 ఆభరణాల తయారీ ప్రక్రియకు తగ్గట్టు వేస్టేజీని వాస్తవికంగా నిర్ణయించాలని ప్రరిశ్రమ కోరడం గమనార్హం. అలాగే, కొత్త నిబంధనల అమలుకు తగినంత సమయం ఇవ్వాలని కూడా కోరింది. సాధారణ బంగారం, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 2.5 శాతం నుంచి 0.5 శాతానికి, వెండి ఆభరణాలకు వేస్టేజీని 3.2 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గిస్తూ మే నెలలో ప్రకటించిన నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. అదే స్టడెడ్‌ జ్యుయలరీ విషయంలో బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల తయారీలో వేస్టేజీని 0.75 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 5 శాతంగా ఉండేది.  

కొంత వెసులుబాటు..: తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం.. చేతితో తయారు చేసిన బంగారం, ప్లాటినం ఆభరణాలకు సంబంధించి గరిష్ట వేస్టేజీని 2.5% వరకు అనుమతించనున్నారు. చేతితో చేసిన వెండి ఆభరణాలకు 3.2 % వేస్టేజీ అమలు కానుంది. మెషిన్లపై చేసిన బంగారం ఆభరణాలకు 0.45% వేస్టేజీ, వెండికి 0.5% అమలు కానుంది. చేతితో చేసిన బంగారం, వెండి, ప్లాటినం స్టడెడ్‌ ఆభరణాలకు 4 శాతం, మెషిన్‌పై చేసిన స్టడెడ్‌ ఆభరణాలు అయితే 2.8% మేర వేస్టేజీని అనుమతించనున్నారు. ఆభరణాలతోపాటు విగ్రహాలు, కాయిన్లు, పతకాలు, ఇతర వస్తువులకు సైతం ఇవే వేస్టేజీ నిబంధనలు అమలవుతాయి. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)