Breaking News

పీఎఫ్‌సీలో మెజారిటీ వాటాకు సై 

Published on Fri, 04/17/2026 - 06:10

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగ ఎన్‌బీఎఫ్‌సీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)లో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకునే యోచనలో ఉంది. విద్యుత్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజాలు పీఎఫ్‌సీతోపాటు.. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)లో పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2026–27 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం పీఎఫ్‌సీలో ఆర్‌ఈసీ విలీనాన్ని చేపట్టనుంది. 

అయితే అతిపెద్ద పీఎస్‌యూ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజంగా ఆవిర్భవించనున్న విలీన సంస్థలో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకోవాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు అనుగుణంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రమోటర్‌గా 51 శాతం వాటాను కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వానికి పీఎఫ్‌సీ ప్రిఫరెన్స్‌ షేర్ల జారీసహా.. వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకున్న మరో అవకాశం ప్రభుత్వానికి కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకాగా.. తద్వారా మెజారిటీ వాటాను నిలుపుకోవచ్చని తెలియజేశారు.  

ప్రభుత్వ వాటా ఇలా 
కంపెనీల చట్టం ప్రకారం పీఎస్‌యూగా గుర్తించేందుకు చెల్లించిన మూలధనంలో ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటా ఉండాలి. ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వ వాటా 55.99 శాతంకాగా.. ఆర్‌ఈసీలో 52.63 శాతం వాటా కలిగి ఉంది. రెండు సంస్థలలోనూ మిగిలిన వాటా సాధారణ వాటాదారుల(పబ్లిక్‌) వద్ద ఉంది. 2025 డిసెంబర్‌31కల్లా పీఎఫ్‌సీ కన్సాలిడేటెడ్‌ లోన్‌ అసెట్‌ బుక్‌ రూ. 11.51 లక్షల కోట్లను తాకగా.. ఆర్‌ఈసీ రూ. 5.82 లక్షల కోట్ల అసెట్‌ బుక్‌ను కలిగి ఉంది. విద్యుత్‌ రంగ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్‌ సౌకర్యాలు కల్పించే పీఎఫ్‌సీ 20 శాతం మార్కెట్‌ వాటాను ఆక్రమిస్తోంది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్‌ఈసీ ఫైనాన్సింగ్‌ సర్వీసులు అందించే సంగతి తెలిసిందే.  

Videos

మైక్రో ఫైనాన్స్ స్కాంలో రామావత్ మధు అరెస్ట్, NEXT అరెస్ట్ ఎవరిది ?

హోదా పక్కన పెట్టి మానవత్వం.. తల్లీ, తండ్రి లేని మహిళా కానిస్టేబుల్ కు సీమంతం

నాకు రాజకీయాల్లో ఎన్నో విషయాలు నేర్పారు.. అవినాష్ కల్మషం లేని వ్యక్తి..

శ్రీయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్, ముంబై ఫ్యాన్స్ కు ఇచ్చిపడేసాడు

జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్

ఇండస్ట్రీని షేక్ చేసే ప్రాజెక్ట్.. 4000 కోట్లు లోడింగ్..

కేంద్ర ఉద్యోగులకి జాక్ పాట్ కనీస వేతనం 69 వేలకు పెంపు

కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్

లోక్ సభలో పరువుపాయే.. TDP MLAల రాసలీలల వీడియోలపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్..

శ్రీరాముడు వలస కూలి.. నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Photos

+5

భూత్‌ బంగ్లా మూవీతో పంజాబీ బ్యూటీ వామికా గబ్బి ట్రెండింగ్‌ (ఫోటోలు)

+5

కోహ్లీ లైక్‌ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)

+5

ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి పుట్టినరోజు వేడుక (ఫోటోలు)

+5

భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు (ఫోటోలు)

+5

ఏపీలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్యక్షేత్రం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

వైట్‌ డ్రెస్‌ ఔట్‌ఫిట్‌లో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

మహేశ్‌బాబు బ్యానర్‌ సినిమా ‘రావు బహదూర్‌’.. సాంగ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్‌ ఎక్స్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

‘శ్రీనివాస మంగాపురం’ మూవీ HD స్టిల్స్

+5

‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)