Breaking News

బంగారం దిగుమతి లెక్కల్లో పొరపాటు

Published on Wed, 01/08/2025 - 22:12

వాణిజ్య లోటు రికార్డు స్థాయికి పెరగడానికి కారణమైన నవంబర్ బంగారం దిగుమతి (Gold Import) డేటాలో చూసిన "అసాధారణ" పెరుగుదలను ప్రభుత్వం తాజాగా సరిదిద్దింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం నవంబర్ నెలలో బంగారం దిగుమతి విలువ 14.8 బిలియన్‌ డాలర్లు నుండి 9.8 బిలియన్‌ డాలర్లకు సర్దుబాటు చేసింది.

గణన లోపం కారణంగా మునుపటి సంఖ్య తప్పుగా ఉంది. జూలైలో పద్దతిలో మార్పును అనుసరించి గిడ్డంగులలో రెట్టింపు లెక్కింపు దీనికి కారణం కావచ్చు. ఈ విషయంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

2024 జనవరి నుండి నవంబర్  వరకు బంగారం దిగుమతులపై సవరించిన డేటా "వార్షిక సగటు 800 టన్నుల కంటే చాలా తక్కువగా ఉంది" అని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా అన్నారు. జనవరి నుండి నవంబర్ వరకు మొత్తం బంగారం దిగుమతులు 796 టన్నుల నుండి 664 టన్నులకు సరిదిద్దారు. అక్టోబర్‌కు సంబంధించి 97 టన్నులు నుండి 58 టన్నులకు, నవంబర్‌లో దిగుబడులను 170 టన్నుల నుండి 117 టన్నులకు సర్దుబాటు చేశారు.

డిసెంబర్ 16న జరిగిన సాధారణ నెలవారీ ట్రేడ్ డేటా బ్రీఫింగ్‌లో, బంగారం దిగుమతులు పెరగడం వల్ల నవంబర్‌లో భారతదేశ వాణిజ్య లోటు రికార్డు గరిష్ట స్థాయి 37.8 బిలియన్‌ డాలర్లకు విస్తరించిందని డేటా చూపించింది . 2024 డిసెంబరులో అసాధారణ పెరుగుదలను గమనించిన డీజీసీఐఎస్‌.. కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ అందుకున్న డేటాతో సమన్వయం చేసుకుంటూ బంగారం దిగుమతి డేటాపై వివరణాత్మక పరిశీలనను చేపట్టింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)