Breaking News

గూగుల్‌కు బిగ్ షాక్‌.. రూ.7,000 కోట్ల ఫైన్‌ చెల్లించాల్సిందే

Published on Sat, 09/16/2023 - 09:18

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ షాక్‌ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్‌, లొకేషన్‌లను ట్రాక్‌ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్‌ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్‌ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్‌ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్‌లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్‌ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్‌ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్‌లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది.



గూగుల్‌ చెప్పినట్లు చేయడం లేదు
దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్‌ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ను ఓపెన్‌ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్‌ గురించి సెర్చ్‌ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్‌ గురించి సెర్చ్‌ చేశారో? ఆ ప్రొడక్ట్‌తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్‌ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్‌ మాత్రం యూజర్లు ట్రాకింగ్‌ ఆప్షన్‌ను డిసేబుల్‌ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్‌ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది. 

గూగుల్‌పై రూ.7,000 కోట్ల దావా ఫైల్‌
ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్‌ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్‌పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్‌ చేశారు. యూజర్లు ట్రాకింగ్‌ ఆప్షన్‌ను డిసేబుల్‌ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్‌ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్‌ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్‌ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్‌ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫలితంగా గూగుల్‌ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది.  

93 మిలియన్‌ డాలర్ల చెల్లింపులు 
తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్‌ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్‌ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్‌ చేసే ముందు వారికి నోటిఫికేషన్‌లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది. 

గూగుల్ దారిలో మెటా
యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్‌ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్‌బుక్‌ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్‌కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)