గూగుల్‌పేలో గోల్డ్‌ లోన్‌..

Published on Sun, 10/06/2024 - 19:08

గూగుల్‌కు చెందిన మొబైల్‌ పేమెంట్‌ సర్వీస్‌ యాప్‌ గూగుల్‌పే (google Pay) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాజర్ల కోసం కొత్త గోల్డ్ లోన్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం గోల్డ్ లోన్‌లలో ప్రత్యేకత కలిగిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ  అయిన ముత్తూట్ ఫైనాన్స్‌తో గూగుల్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

దీంతో చిరు వ్యాపారులు, ఇతర కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు గూగుల్‌పే ద్వారా సులభంగా బంగారు ఆభరణాలపై రుణాలను పొందవచ్చు. గోల్డ్ లోన్‌ల కోసం  మరో ఎన్‌బీఎఫ్‌సీ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్‌తో కూడా గూగుల్‌పే జట్టు కట్టింది. గూగుల్‌పే అందిస్తున్న ఈ ఫీచర్‌తో వినియోగదారులు క్రెడిట్ రిపోర్ట్ లేదా విస్తృతమైన డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేకుండానే రూ. 50 లక్షల వరకు లోన్‌ తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకుంటున్నవారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది టైర్-2 నగరాలు, చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. ఇక్రా ప్రకారం.. వ్యవస్థీకృత గోల్డ్ లోన్ మార్కెట్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కోట్లను అధిగమిస్తుందని, 2027 మార్చి నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)