Breaking News

జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!

Published on Fri, 02/23/2024 - 21:54

ఆన్​లైన్​ పేమెంట్​ యాప్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన 'గూగుల్ పే' (Google Pay) చాలా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే 2024 జూన్ 4 నుంచి అమెరికాలో గూగుల్ పే సేవలు నిలిపివేసేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. 

అమెరికాలో ఎక్కువమంది గూగుల్ పే కంటే 'గూగుల్ వాలెట్' ఉపయోగిస్తున్న కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ వాలెట్ ద్వారా పేమెంట్ కార్డులను యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తరువాత షాపింగ్ లేదా ఇతరత్రా ఆన్​లైన్​ పేమెంట్ చేసేటప్పుడు ట్యాప్ అండ్ పే పద్దతిలో పని సులభంగా పూర్తయిపోతుంది.

కేవలం ఆన్​లైన్​ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా.. ట్రాన్సిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ఐడీ కార్డ్స్ వంటి డాక్యుమెంట్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. ఈ కారణంగానే అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ ఎక్కువ ఆదరణ పొందింది. గూగుల్ పేలో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా గూగుల్ వాలెట్‌లో లభిస్తాయి. 

2024 జూన్ 4 వరకు వినియోగదారులు గూగుల్ పే ఉపయోగించుకోవచ్చు, గడువు తీరిన తరువాత అమెరికన్ యూజర్లు అమౌంట్ సెండ్ చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికిగానీ అవకాశం లేదు. కాబట్టి యూఎస్ఏలోని గూగుల్ పే యూజర్స్ దీనిని తప్పకుండా గమనించాలి.

ఇదీ చదవండి: జెరోధా సీఈఓపై మండిపడుతున్న నెటిజెన్స్!.. కారణం ఇదే..

ఇండియా, సింగపూర్ వంటి దేశాల్లో గూగుల్ పే యధావిధిగా సేవలను అందిస్తుంది. అంతే కాకుండా ఆయా దేశాల్లోని యూజర్లకు కావలసిన మరిన్ని సేవలను అందించడానికి సంస్థ ఈ యాప్​ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇండియాలోని గూగుల్ పే యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)